పచ్చదండు పైశాచికం

చంద్రబాబు కనుసన్నల్లో సమావేశాలు
మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేల ఇష్టారాజ్యం
ప్రజాసమస్యలను పక్కదారి పట్టించేందుకు..
ప్రతిపక్ష నేత ప్రసంగానికి అడ్డంకులు
వైఎస్ జగన్ పై వ్యక్తిగత దూషణలు

హైదరాబాద్ః చంద్రబాబు తన మంత్రులు, ఎమ్మెల్యేలకు బాగానే ట్రైనింగ్ ఇచ్చారు. అసెంబ్లీలో ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం చర్చ సందర్భంగా...సభలో తెలుగుతమ్ముళ్లు మరోసారి తమ నోటికి పనిచెప్పారు. చంద్రబాబు కనుసన్నల్లో సభను బుల్డోజ్ చేసేందుకు కుట్రకు తెరలేపారు. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు, సబ్జక్ట్ ను పక్కదారి పట్టించేందుకు మంత్రులు ఒక్కొక్కరుగా యథారాజా తథాప్రజా అన్నట్లు రెచ్చిపోయారు.

ప్రజావ్యతిరేక పాలన సాగిస్తున్న టీడీపీ నేతల అరాచకాలను... ప్రభుత్వ అవినీతి, అక్రమాలను తప్పిదాలను వైఎస్ జగన్ ఎత్తి చూపారు. ఐతే, ప్రజల ముందు దోషిగా నిలబడాల్సి వస్తుందని భయపడిపోయిన పచ్చదండు...ముందస్తు స్క్రిప్ట్ ప్రకారం ప్రతిపక్ష నేతపై వ్యక్తిగత దూషణలకు దిగారు. చర్చను డైవర్ట్ చేసేందుకు మధ్యమధ్యలో లేస్తూ ఇష్టమొచ్చినట్లు తిట్లపురాణం ఎత్తుకున్నారు. పచ్చనేతలు లేచినప్పుడుల్లా స్పీకర్ మైక్ ఇవ్వడం, ప్రతిపక్ష నేతలకు మైక్ కట్ చేయడం సభలో షరామామూలైపోయింది. 

చంద్రబాబు మొదలు మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు అధికారాన్ని అడ్డంపెట్టుకొని... అడ్డదిడ్డంగా మాట్లాడుతూ తమ ప్రభుత్వ తీరును సమర్థించుకున్నారు. ప్రజాసమస్యలపై ప్రతిపక్ష నేత సంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక..అచ్చెన్నాయుడు, బోండ ఉమ, గోరంట్ల బుచ్చయ్య, దేవినేని ఉమ, రావెల కిషోర్, నిమ్మకాల, కాల్వ శ్రీనివాసుల ఇలా ఒకరెనుక ఒకరు పోటీపడి మరి వైఎస్ జగన్ పై ఎదురుదాడికి దిగారు. సభలో ప్రజావాణి వినిపించకుండా మరోసారి ప్రతిపక్షం గొంతు నొక్కారు. 

అసెంబ్లీ సమావేశాలు అనగానే చంద్రబాబు అండ్ కో...తమ మోసాలను తొక్కిపెట్టేందుకు గ్రౌండ్ వర్క్ మొదలుపెడుతోంది. అలా బాబు డైరక్షన్ లో ముందస్తు ప్రణాళికగా అనుకున్న స్క్రిప్ట్ ను తమ్ముళ్లు ఫాలో అవుతారు.  ప్రజా సమస్యలను తప్పుదోవ పట్టిస్తూ...చర్చను అడ్డుకోవడమే ధ్యేయంగా అడ్డంకులు సృష్టిస్తారు.  అదే వైఖరిని ఈసారి అమలు చేశారు.  వైఎస్ జగన్ ప్రసంగిస్తున్న ప్రతిసారి పచ్చచొక్కాలు అడ్డుతగిలి...టాపిక్ డైవర్ట్ చేసేందుకు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. తనపై అధికారపార్టీ నేతలు ఎన్ని అభాండాలు వేసినా...జననేత సంయమనం పాటించారు.  ప్రజలు పడుతున్న అవస్థలను సభాసాక్షిగా ప్రస్తావిస్తూనే...మంత్రులకు, ఎమ్మెల్యేలకు చురకలు అంటించారు. 

 
Back to Top