రైతులకు కుచ్చు టోపీ

హైదరాబాద్: చంద్రబాబు పుణ్యమా అని రైతులకు మరో షాక్ తగిలింది. రుణ మాఫీ పేరుతో చంద్రబాబు చేసిన మోసంతో రైతులు మరో రకంగా కూడా ఇబ్బంది పడుతున్నారు.

ప్రతీ ఏటా రైతులు వ్యవసాయం కోసం వ్యవసాయ రుణాలు, బంగారంపై తాకట్టు రుణాలు తెచ్చుకోవటం అలవాటు. వీటిని తర్వాత పంట సమయానికి కట్టేసి రెన్యూవల్ చేయించుకొంటే ఏడు శాతం వడ్డీ పడుతుంది. ఆ గడువు దాటితే మొదట నుంచి 14 శాతం వడ్డీ పడుతుంది. తర్వాత అపరాధ రుసుం పడి తడిసి మోపెడు అవుతుంది.  ఈ నేపథ్యంలో 2014 ఎన్నికల్లో చంద్రబాబు రుణ మాఫీ చేస్తానని చెప్పి హామీలు గుప్పించారు. బాబు వస్తే రుణాలన్నీ మాఫీ అవుతాయని ప్రకటించారు. దీన్మినమ్మిన రైతులు పూర్తిగా ఓట్లేసి గెలిపించారు. అదిగదిగో రుణమాఫీ అని ఊరించటంతో నిజమని నమ్మి రెన్యూవల్ చేయించుకోకుండా ఉండిపోయారు. దీంతో అప్పులన్నీ తడిసి మోపెడు అయి అప్పుల ఊబిలో కూరుకొని పోయారు.

మరో వైపు, అప్పుల్ని రెన్యూవల్ చేయించుకోక పోవటంతో రైతులు పాస్ బుక్ లు  అన్నీ బ్యాంకుల్లో ఉండిపోయాయి. దీంతో బీమా ప్రీమియం చెల్లింపు జరగలేదు. మొన్నటి ఖరీఫ్ లో చాలా వరకు పొలాల్లో పంట నష్టం జరిగింది. ప్రక్రతి కన్నెర్ర చేయటంతో తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. కానీ, బీమా క్లెయిమ్ చేసుకొందామంటే లక్షల మంది రైతుల్ని అనర్హులుగా ప్రకటించారు. చంద్రబాబు చేసిన రుణమాఫీ మోసం.. ప్రజలకు శాపంగా మారింది. బీమా పరిహారం అందక పోవటంతో తర్వాత పంటకు పెట్టుబడి కరవు అవుతోంది. ఒక వైపు రుణమాఫీ జరగక పోవటం, ఇటు బీమా పరిహారం రాకపోవటంతో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. 

Back to Top