బాబు వ‌చ్చె... నీరు పోయె..!

చంద్రబాబు..కరువు కవల పిల్లలు..!
బాబు రాకతో మొహం చాటేసిన వరణుడు
డెడ్ స్టోరేజ్ కు చేరిన జలాశయాలు

హైద‌రాబాద్‌: చంద్రబాబు అధికారంలోకి వస్తే  ప్రజలే  కాదు ఆఖరికి జలాశయాలు కూడ కన్నీరు పెడుతున్నాయి. చంద్రబాబు, కరువు కవల పిల్లలుగా మారి రైతన్నను ముప్పుతిప్పలు పెడుతున్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ప్రతిసారీ వరణుడు మొహం చాటేస్తున్నాడు.  ఎన్నడూ లేనంతగా ఈసారి శ్రీశైలం ప్రాజెక్ట్  డెడ్ స్టోరేజీకి చేరుకుంది. సాగు సంగతేమోగానీ, కనీసం తాగడానికి కూడా నీరుండని పరిస్థితి దాపురించింది. ఇలాంటి పరిస్థితులున్నాయని తెలిసి కూడా చంద్రబాబు మరోసారి ప్రజలను మోసపుచ్చుతున్నారు. రాయలసీమకు నీళ్లిస్తామంటూ కళ్లబొళ్లి మాటలతో మభ్యపెడుతున్నారు. 

నీరు లేక వెలవెల..!
సెప్టెంబర్ నాటికి నిండుకుండలా కళకళలాడాల్సిన జలాశయం నీరు లేక వెలవెలబోతోంది. ఎగువన భారీ వర్షాలు కురిసి కృష్మమ్మ పోటెత్తితే తప్ప నీళ్లు వచ్చే పరిస్థితి లేదు. ప్రస్తుతం శ్రీశైలం నీలం సంజీవరెడ్డి డ్యాంలో 794.90 అడుగుల నీటిమట్టం మాత్రమే ఉంది. అంటే 26.5381 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రతి ఏడాది సెప్టెంబర్ నాటికి లక్షల క్యూసెక్కుల్లో నీరు వచ్చిచేరేది. కానీ చంద్రబాబు పుణ్యమా అని ఉన్న నీరు కాస్తా ఇంకిపోతోంది. ప్రాజెక్ట్ కనీస నీటిమట్టం కాపాడాలని హైకోర్టు ఆదేశాలున్నా..చంద్రబాబు సర్కార్ వాటిని ఖాతరు చేయడం లేదు. 

గడ్డు పరిస్థితులు..!
భారీగా వర్షాలు కురిసి ప్రాజెక్ట్ లు నిండాలని  ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు. లేకుంటే తీవ్ర ఇక్కట్లు తప్పవని దు:ఖిస్తున్నారు. వర్షాభావ పరిస్థితులతో ఇప్పటికే ఖరీఫ్ కాలం చేసింది. తాగు నీటికి కటకట ఏర్పడింది. ఇకనుంచైనా వర్షాలు కురిస్తే గండం నుంచి గట్టెక్కవచ్చు. లేకుంటే  మరింత గడ్డుపరిస్థితులు ఎదుర్కోవాల్సి రావడం ఖాయం.  

Back to Top