<br/>అధర్మం అన్నివేళలా గెలవదు. మీసాలు మెలేస్తేనో, తొడలు, జబ్బలు చరిచేస్తేనో, నోరేసుకుని పడిపోతే నిజం అబద్ధం అయిపోదు. బూతులు మాట్లాడేస్తే ఎదుటివాళ్లు భయపడిపోతారనుకుంటే కుదరదు. కొద్ది రోజుల కిందట పక్కా తెలుగుదేశం ఛానెల్ అని పిలిపించుకుంటున్న ఎబిఎన్ లో బిగ్ డిబేట్ అనే కార్యక్రమంలో సిఎమ్ రమేష్ అహంకారం, టెంపరితనం, కుసంస్కారం పూర్తిగా బయటపడ్డాయి. చంద్రబాబును కాల్చి చంపినా పాపం లేదన్నందుకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై కేసులు పెట్టాలంటూ, ఆయన ఫాక్షనిష్టు అంటూ అరచి గోల పెట్టిన మైకులు, సిఎమ్ రమేష్ మీడియా సాక్షిగా మాట్లాడిన బూతులపై కనీసం ఖండన కూడా చేయకపోవడం వారి పక్షపాత ధోరణికి నిదర్శనం. <br/>ఇప్పుడు ఐటి సోదాల్లో దొరుకుతున్న ఆధారాలు ఆ నాయకుడి అవినీతి విశ్వరూపాలను బయటపెడుతున్నాయి. ఈయనగారి అవినీతి సొరంగాన్ని తవ్వుకుంటూ వెళ్లితే అది అధికారపార్టీ అధినేత, ఆయనగారి పుత్ర రత్నం దాకా వెళ్లి ఆగింది. ప్రభుత్వం కట్టబెట్టిన కాంట్రాక్టుల్లో పనులు చేయకుండా బిల్లులు దండుకుని, వాటిని వేరే కంపెనీ ఖాతాలకు మళ్లించేసి, ఆ సొమ్మును డ్రాచేసి ఎటు మళ్లించేసారో అనే వివరాలన్నీ ఐటి అధికారులు ఆరాతీస్తారు. రిత్విక్ అనే బొడ్డూడని నిర్మాణ సంస్థకు చంద్రబాబు ప్రభుత్వం కోట్ల విలువైన ప్రాజెక్టులు ఎందుకు కట్టబెట్టిందో అందరికీ తెలుసు. దాదాపు 100 కోట్ల రూపాయిలు దారిమళ్లిన దాఖలాలు ఉన్నాయంటూ ఐటి అధికారులు నిగ్గుతేల్చారు. ఐటి సోదాలు మొదలైనప్పటి నుంచి ఇది కక్షసాధింపు చర్య అంటూ నానా రచ్చ చేసిన తెలుగుదేశం నేతలు, ఇది చంద్రబాబుపై, ఎపి పై జరుగుతున్న కుట్రం అంటూ గొంతు చించుకున్న పచ్చ మీడియా నేడు సిఎం రమేష్ అవినీతి ఆస్తుల గురించిన రిపోర్టులపై ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదు. కేరళ అయ్యప్ప గుడి ఇష్యూలు, పంజాబ్ రైలు ప్రమాదం సంఘటనల చాటున ఈ నిజాలను కప్పెట్టే ప్రయత్నం చేస్తోంది. తమ భుజాలకెత్తుకుని మోస్తున్న ప్రభుత్వపు అవినీతి భాగోతాలను సాధ్యమైనంతగా ప్రజలకు చేరకుండా దాచిపెట్టేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోంది. <br/>సిఎమ్ రమేష్ రకరకాల మార్గాల్లో అవినీతిని చేసినట్టు ఆధారాలు కనిపిస్తున్నాయి. దొ్ంగ కంపెనీలు సృష్టించి, వాటికి సొమ్ములు బదలాయించి, అక్కడి నుండి డబ్బులు స్వాహా చేయడం. స్టీలు, నిర్మాణ సామగ్రి కొన్నట్టు లెక్కలు దొంగ బిల్లులు సృష్టించి డబ్బులు ఖర్చైనట్టు లెక్కలు చూపించడం. రకరకాల కంపెనీలకు సబ్ కాంట్రాక్టులు ఇచ్చినట్టు బిల్లులు చూపించడం. ఇవన్నీ ప్రభుత్వం నుంచి పనులు చేయకుండానే తీసుకున్న డబ్బును చేతులు మార్చడానికి చేసిన దొడ్డిదారులు అని చెప్పాలి. ఎడ్కో ఇండియా ప్రైవేటు లిమిటెడ్ అనేది సిఎమ్ రమేష్ జేబు సంస్థ. రిత్విక్ నుంచి కోట్ల రూపాయిల సొమ్ము ఈ సంస్థకు మళ్లింది. కానీ ఈ సంస్థకు చెందిన లేబుళ్లు స్టాంపులన్నీ రిత్విక్ సంస్థకే చెందిన ఓ ఉద్యోగి వద్ద ఉన్నాయి. అంటే రిత్విక్ సంస్థ యజమాని అయిన సిఎం రమేష్ ఎడ్కో పేరుతో తన ఉద్యోగి పేర షెల్ కంపెనీ ఓపెన్ చేసి సొమ్మును దారిమళ్ళించాడు. ఇక రకరకాల సంస్థల నుంచి స్టీలు కొనుగోళ్లు చేసినట్టు ఉన్న బిల్లులపై విచారణ చేస్తే ఆ పేరుతో కంపెనీలే లేవన్న వాస్తవం బట్టబయలైంది. అంటే ఎలాంటి కొనుగోళ్లూ లేకుండానే దొంగ బిల్లులు సృష్టించి ప్రభుత్వం నుంచి కాంట్రాక్టు డబ్బులు దండుకున్నారు. కొన్ని చోట్ల కొనుగోళ్లు చేసినట్టు బిల్లు ఇచ్చి, కొన్న చోట నుంచి తిరిగి డబ్బులు వెనక్కి తీసేసుకున్నారు. కొన్ని కంపెనీల పేర్లతో ఉన్న బిల్లులు ఉన్నా, అమ్మిన కంపెనీల వద్ద వీరు కొన్నట్టు రికార్డులే లేవు. కొన్ని కోట్ల రూపాయిలకైతే లెక్కలే లేవు. మరి కొన్ని కోట్లు సొంత ఖర్చులకు వాడేసారు. అంటే దొంగ బిల్లులు సమర్పించి ప్రాజెక్టుల పనులు చేయకుండానే ప్రభుత్వం కాంట్రాక్టర్లకు డబ్బులు ఇచ్చేసింది. తమ్మడు తనవాడైతే అన్న సామెత ఇక్కడ ఖచ్చితంగా సరిపోతోంది. తెలుగు తమ్ముళ్లకు కాంట్రాక్టులు కట్టబెట్టడంలో చంద్రబాబు ఉత్సాహాన్ని దేంతోనూ కొలవలేం. ఇంతకీ దొడ్డిదారుల్లో మళ్లించిన ఈ సొమ్ము ఎవరి దగ్గరకు చేరిందనే విషయంలో అధికారులకు ఆధారాలు దొరికాయట. సిఎమ్ రమేష్ ఖాతాల నుంచి భోగస్ కంపెనీల ద్వారా వెళ్లిన డబ్బు ఫిరాయింపు నేతలకు అందిందని ప్రాధమిక దర్యాప్తులో అధికారులు గుర్తించారు. ఇదండీ సంగతి మీసాలు మేలేసి దమ్ముంటే చూపించండీ అంటూ సిఎమ్ రమేష్ వేసిన వీరంగం అంతా పులి వేషం అని, మేకపోతు గాంభీర్యం అని అర్థం అవుతోంది. బాబుగారి బినామీల కూసాలు కదులుతున్నాయి. ఇదంతా బిజెపి కుట్ర అంటూ అవినీతి సామ్రాజ్యాన్ని అర్థంలేని ఆరోపణల వెనుక దాయాలనుకున్న టిడిపి అధినాయకుడి అసలు రూపం బైటపడింది. తెలుగు తమ్ముళ్ల అవినీతి వెనకున్న అసలు సూత్రధారి పేరు కూడా త్వరలో బయటకు వస్తుంది. <br/>