కడప ఎన్నికల పరిశీలకునిగా వైయస్‌ వివేకా

హైదరాబాద్, 21 ఏప్రిల్ 2014:

వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కడప జిల్లా ఎన్నికల పరిశీలకునిగా మాజీ మంత్రి  వైయస్ వివేకానందరెడ్డి నియమితులయ్యారు. పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఓవీ రమణ నియమితులయ్యారు. వైయస్ఆర్‌సీపీ అధ్యక్షు‌డు శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు వీరిని నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది.

వీరితో పాటు జార్జి హెర్బర్టును పార్టీ క్రిస్టియన్‌ మైనార్టీస్‌ రాష్ట్ర విభాగం అధ్యక్షునిగా, ఇక్బాల్‌ హుస్సేన్‌ ఫారూఖీని పార్టీ కేంద్ర కార్యనిర్వాహక మండలి (సీఈసీ) సభ్యునిగా, నసీర్‌ అహ్మద్‌ను సీమాంధ్ర జిల్లాల మైనారిటీ సమన్వయకర్తగాను, షౌకత్‌ అలీని గుంటూరు లోక్‌సభ నియోజకవర్గం మైనారిటీ ఎన్నికల పరిశీలకునిగా, అబ్దుల్‌ ఖదీర్‌ను ప్రకాశం జిల్లా మైనారిటీ ఎన్నికల పరిశీలకునిగా నియమించారు. బి. జనక్‌ ప్రసాద్‌కు జహీరాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గం ఎన్నికల పరిశీలకునిగా బాధ్యతలు అప్పగించారు.

Back to Top