18న వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర స్థాయి భేటీ

హైదరాబాద్, 16 నవంబర్ 2013:

రాష్ట్రంలో నెలకొన్న ప్రత్యేక రాజకీయ పరిస్థితులు, పార్టీ సంస్థాగత అంశాలపై చర్చించేందుకు ఈ నెల 18న‌ రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహిస్తున్నట్లు వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కో ఆర్డినేటర్‌ పీఎన్‌వీ ప్రసాద్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశానికి పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి అధ్యక్షత వహిస్తారు. ఆ రోజు ఉదయం 9.30 గంటలకు ఈ సమావేశం ప్రారంభం అవుతుందని ప్రసాద్‌ తెలిపారు.

ఈ సమావేశంలో పార్టీ సీజీసీ, సీఈసీ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, పార్లమెంటు నియోజకవర్గాల కో ఆర్డినేటర్లు, పార్లమెంటు అబ్జర్వర్లు, అసెంబ్లీ నియోజకవర్గాల కో ఆర్డినేటర్లు, జిల్లా కన్వీనర్లు, రాష్ట్ర అధికార ప్రతినిధిలు, అనుబంధ విభాగాల రాష్ట్ర కన్వీనర్లు, రీజనల్‌ కో ఆర్డినేటర్లు పాల్గొంటారని ఆ ప్రకటనలో ప్రసాద్‌ వివరించారు.

Back to Top