చంద్రబాబు చరిత్ర హీనుడు

వైయస్ఆర్ సీపీ అధినేత వైయస్ జగన్ సోదరి  వైయస్‌ షర్మిళ

అసత్యానికి మారుపేరు చంద్రబాబు

చంద్రబాబుది రోజుకో మాట,పూటకో వేషం

భూతద్దం పెట్టి వెతికిన ఏపీలో అభివృద్ధి కనబడదు

అన్నివర్గాల భవిష్యత్‌ను చంద్రబాబు ఖూనీ చేశారు

బాబు వస్తే జాబు వస్తుందన్నారు..చంద్రబాబు సుపుత్రుడికే జాబు వచ్చింది

జయంతి,వర్ధంతికి  తేడా తెలియని వాడు.. మూడు శాఖలకు మంత్రా..

 

అమరావతి: జరగబోయే ఎన్నికలు మిగతా అన్ని రాష్ట్రాల కన్నా ఆంధ్ర రాష్టానికి చాలా కీలకం అని వైయస్‌ షర్మిల అన్నారు. ఆమె విజయవాడలో వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి కుమార్తెగానే కాకుండా, ఒక సామాన్య పౌరురాలిగా మి ముందు కొన్ని విషయాలు మాట్లాడతాను. భూతద్దం పెట్టుకుని వెతికిన ఏపీలో అభివృద్ధి కనబడుతుందా..ఎన్ని పరిశ్రమలు వచ్చాయి. ఎన్ని ఉద్యోగాలు వస్తున్నాయి. రైతు బాగుపడుతున్నాడా.పేదవారు సంతోషంగా ఉన్నారా, పేద విద్యార్థులకు భరోసా ఉందా. వైయస్‌ఆర్‌ హయాంలో కళకళలాడిన రాష్ట్రమేనా ఇది అని ఆలోచన చేస్తే చాలా బాధేస్తుంది.

వైయస్‌ఆర్‌ హయాంలో పేద కుటుంబాలు సంతోషంగా ఉండేవి. రైతు కుటుంబం« ధైర్యంగా ఉండేంది. గిట్టుబాటు ధర ఉండేది.ప్రతి వ్యక్తికి ఉపాధి ఉండేది. పేదవారు గొప్ప చదువులు ఉచితంగా చదువుకునే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఉండేది. పేదవాళ్లకు ఆరోగ్యశ్రీ ఉండేది. ప్రతి మహిళలకు భరోసా ఉండేది. కుల,మతా,పార్టీలకు అతీతంగా ప్రతి వర్గానికి వైయస్‌ఆర్‌ మేలు చేశారు. చంద్రబాబు హయాంలో ఎలా ఉంది..గొప్పలు చెప్పుకోవడమే తప్ప చంద్రబాబు హయాంలో పాతికేళ్లు వెనక్కు నెట్టబడింది.మొదటి ఐదు సంతకాలు అని,చంద్రబాబు చెప్పారు. కనీసం మొదటి సంతకానికైనా విలువ నిచ్చారా..అధికారంలోకి రావడానికి మొత్తం రుణమాఫీ అని వాగ్ధానం చేసి..ఎన్నికలు అయిన తర్వాత ఆ రుణమాఫీపై సంతకంపై పెట్టకుండా..కమిటీని వేస్తున్నానని సంతకం పెట్టారు. ఆ రోజు మొత్తం రుణం 87 వేల కోట్ల రూపాయలు..కోటయ్య కమిటీ సాకులు చూపి 24వేల కోట్లకు కుదించింది.

చంద్రబాబు నేటివరుకూ పూర్తిగా చెల్లించలేదు. కేవలం అధికారం కోసం అబద్ధాపు వాగ్ధానాలు ఇచ్చారు. డ్వాక్రా మహిళలకు మొత్తం రుణమాఫీ చేస్తానని వాగ్ధానం చేశారు. ఇటీవల ఆ శాఖకు సంబంధించిన మంత్రి పరిటాల సునీత అసెంబ్లీలో రుణమాఫీ చేయలేదని ప్రకటించలేదా..చేసే ఉద్దేశం కూడా లేదన్నారు.ఆ రోజు మహిళలకు ఉన్న మొత్తం రుణం 14వేల కోట్ల రూపాయలు..నేటికి 25వేల కోట్ల రూపాయలు అయ్యింది.కేవలం ఆరువేల కోట్లతో బిక్షం ఇచ్చినట్లు..పసుపు–కుంకమ పేరుచెప్పి మహిళలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు.14వేల కోట్ల రూపాయల పోలవరం ప్రాజెక్టు అంచనాను 60వేల కోట్లకు పెంచారు. కమీషన్లు ద్వారా లాభపడాలని నామినేషన్‌ పద్దతిలో వారికి కావాల్సిన కాంట్రాక్టర్లకు ఇచ్చుకోవాలని కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రాజెక్టును లాగేసుకోలేదా.. పోలవరం మూడేళ్లలో పూర్తిచేస్తానని చంద్రబాబు వాగ్ధానం చేయలేదా..అమరావతిలో 4వేల ఎకరాలు,ఎకరం మూడు,నాలుగు కోట్ల విలువ చేసే భూమిని కేవలం 50 లక్షలకు తన బినామీలకు అమ్మేసి ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టలేదా..రాజామౌళి దర్శకత్వంలో గ్రాఫిక్స్‌ చూపించారు. మనవాళ్లు సరిపోరని  సింగపూర్‌ నుంచి ప్లానర్స్‌ను రప్పించారు. త్రిడి మోడళ్లను చూపించారు తప్ప ఒక శాశ్వత భవనమైనా కట్టించారా..

అమరావతిని అనాధను చేస్తూ ఒక శాశ్వత భవనం కట్టలేదు కాని, చంద్రబాబుకు హైదరాబాద్‌లో ఉన్న  పర్మినెంట్‌ భవనం కోసం ప్రజల డబ్బును ఖర్చుపెట్టలేదా..ప్రజల సోమ్మును దుర్వినియోగం చేయలేదా..పేద విద్యార్థులు గొప్ప చదువులు చదువుకోక పోతే పేదరికం నుంచి బయటపడలేరని వైయస్‌ఆర్‌ పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చేశారని..కాని చంద్రబాబు మాత్రం మేము అంతా ఇవ్వం.కొంచెం ఇస్తామని చెప్పి చివరుకు అది కూడా ఇవ్వకపోతే..తన తల్లిదండ్రులు అప్పులపాలు అయిపోతున్నారని ఎంతోమంది విద్యార్థులు చదువులు మానేశారు. చంద్రబాబు ఆయన చేతితో విద్యార్థుల భవిష్యత్‌ ఖూనీ చేశారన్నారు.పేదవారు గొప్పవాడిలా కార్పొరేట్‌ ఆసుప్రతికి వెళ్ళి వైద్యం చేయించుకోవాలని వైయస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీని ప్రవేశపెడితే..చంద్రబాబు ఆరోగ్యశ్రీ లిస్ట్‌ నుంచి ఎన్నో కార్పొరేట్‌ ఆసుపత్రులను తొలగించి..పేదవారు గవర్నమెంట్‌ ఆసుప్రతికి మాత్రమే వెళ్ళాలని చంద్రబాబు శాసించలేదా..ఇది అమానుషం కాదా.చంద్రబాబు,వారి కుటుంబాలకు జబ్బులొస్తే గవర్నమెంట్‌ ఆసుప్రతికి వెళ్తారా..మంచి వైద్యం అందక పేదవాళ్లు చనిపోతే ఆ పాపం చంద్రబాబుది కాదా..?

బాబు వస్తే జాబు వస్తుందన్నారు. ఎవరికి వచ్చింది.చంద్రబాబు సుపుత్రుడు లోకేష్‌కు వచ్చింది.ఏకంగా  మూడు మంత్రి శాఖలను అప్పగించారు.జయంతి,వర్ధంతికి కూడా తేడా తెలియని వాడు. అఆలు కూడా రావుకాని అగ్రతాంబూలం నాకే అన్నాడంట ఒకడు..అనే చందాన ఒక ఎన్నికల్లో కూడా గెలవలేదు.ఏ అర్హత,అనుభవం ఉందని,ఒకటి,రెండు కాదు మూడు శాఖలకు మంత్రిని చేశారు. ఇది పుత్రవాత్స్యలం కాదా..చంద్రబాబు కొడుకుకు మూడు ఉద్యోగాలు ఇవ్వొచ్చు..సామాన్య ప్రజలకు ఉద్యోగాలులేవు, ఉద్యోగ నోటిఫికేషన్లు లేవు. ఇది దుర్మార్గం కాదా..స్వార్థం కాదా..ఒక సామాన్యరాలిగా అడుగుతున్నా..తెలంగాణలో కేసీఆర్‌ కొడుకు కేటీఆర్‌కు ఐటి శాఖ ఇచ్చారని, చంద్రబాబు ఆయన కొడుక్కి ఇచ్చారు.ఆయన లాగా ఈయన కూడా గొప్ప గొప్ప కంపెనీలు ఏమైనా తెచ్చాడా అని చూస్తే..వీళ్లు గొప్పగా మైక్రోసాఫ్ట్‌ కంపెనీ వస్తుందని ప్రచారం చేసిన 12 గంటల లోపు మాకాఉద్దేశం లేదని వారు ప్రకటించారు.కేవలం ప్రభుత్వం వద్ద మాత్రమే ఉండాల్సిన ఆధార్,ఓటర్,బ్యాంక్‌ వివరాలు లోకేష్‌ దొంగతనం చేసి తనకు కావాల్సిన ప్రైవేట్‌ కంపెనీలకు ఇచ్చుకున్నాడు.ఏ కుటుంబంలో ఎంత మంది మహిళలు ఉన్నారు.ఏ అక్కౌంట్‌లో ఎంత డబ్బు ఉన్నది అనేది బయటపడింది.దీనికి కారణం ఏవరో చంద్రబాబుకు తెలియదా.

ఇప్పటికైనా ఆ డేటాను స్వాధీనం చేసుకుని దోషులను శిక్షించాస్తారని అనుకుంటే..అలా చేయకపోతే వారికి మేమే ఆశ్రయం కల్పిస్తున్నామని ప్రకటించారంటే ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబుకు సిగ్గు అనిపించలేదా..?బాబు,మోదీ జోడి కలిసి ఆంధ్రకు రావాల్సిన ప్రత్యేకహోదాను ఎగ్గొటారు.బీజేపీ మన చెవుల్లో పూవ్వులు పెట్టి మనకు ద్రోహం చేసిందంటే దానికి కారణం చంద్రబాబు కారణం కాదా..హోదా వద్దు ఫ్యాకేజీ ముద్దు అని  అసెంబ్లీలో చంద్రబాబు ధన్యవాద తీర్మానం పెట్టలేదా..హోదా కోసం పోరాడతామంటే జైల్లో పెడతామని చంద్రబాబు బెదిరించలేదా..హోదా వచ్చిన రాష్ట్రాలు ఏం బాగుపడ్డాయని చంద్రబాబు హేళన చేయలేదా..ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌ హోదా కోసం పోరాటంలో భాగంగా విశాఖ పట్నం  వెళ్తే  ఎయిర్‌పోర్ట్‌లో  నిర్భదించలేదా.వైయస్‌ఆర్‌సీపీ నాయకులు హోదాకోసం అసెంబ్లీని ముట్టడిస్తే చంద్రబాబు వారిని అరెస్ట్‌ చేయించి ఉద్యమాన్ని అణించివేసే చర్యలు చేయలేదా.ఆంధ్ర రాష్ట్రానికి కీలకమైన  ప్రత్యేకహోదాను నీరుగార్చిన చంద్రబాబు చరిత్రహీనుడిగా మిగిలిపోడా..ఆడపిల్ల పూడితే 25వేల రూపాయలు మహాలక్ష్మి పథకం కింద వారి బ్యాంకు ఖాతాల్లో నేరుగా వేస్తాయని తెలిపారు.

ఈ ఐదేళ్లలో 25వేలు ఇచ్చారా..కేజీ నుంచిపీజీ వరుకూ ఉచిత విద్య అన్నారు.కాలేజి విద్యార్థులకు ఐపాడ్‌ అన్నారు..ఇచ్చారా..ఇంటికోక ఉద్యోగం,లేకపోతే 2వేల నిరుద్యోగ భృతి అన్నారు..ఇచ్చారా..లక్ష 20వేల రూపాయలు చంద్రబాబు ప్రతి ఇంటికి బాకీ పడ్డారు. ఆ బాకీ తీర్చేసారా..ప్రతి పేదవాడికి మూడు సెంట్ల భూమి, పక్కా ఇళ్లు అన్నారు..కట్టించారా..చేనేతలకు మరమగ్గాలకు పూర్తి రుణమాఫీ అన్నారు..చేసారా.,,రెండు రూపాయలకే 25 లీటర్ల మినరల్‌ వాటర్‌ అన్నారు..ఇస్తున్నారా.. ఆంధ్రను అప్పుల ఆంధ్రగా మార్చారు.స్థానిక ప్రతినిధులను పక్కనపెట్టి జన్మభూమి కమిటీలను నియమించి..లంచగొండితనం,దౌర్జన్యాలను ప్రోత్సహించడం,ఎక్కడ చూసిన మాఫియా అవినీతి,ఇసుక దగ్గర నుంచి వేల ఎకరాల భూస్కాంల వరుకు, ప్రాజెక్టుల నుంచి ఇన్‌ప్రాస్ట్రక్చర్‌ ప్రాజెక్టుల వరుకూ ఎంతో అవినీతి జరిగింది. ప్రజలు గమనించాలి. గత ఎన్నికల్లో చంద్రబాబు ఆరువందల హామీలు ఇచ్చారు. ఒకటికూడా పూర్తిగా నిలబెట్టుకోలేదు. వాటిని పాతిపెట్టి ఎన్నికలు వచ్చాయి కనుక మళ్లీ మోసపు హామీలు,కొత్త అబద్ధాలు మాట్లాడుతున్నారు.

ఇచ్చిన హామీలన్ని  చంద్రబాబు నిలబెట్టుకుంటే..నేనే ఇచ్చిన హామీలన్ని నిలబెట్టుకున్నాను అని చెప్పి కదా చంద్రబాబు ఓట్లు అడగాలి..మళ్లీ ఎన్నికలు వచ్చాయి. చంద్రబాబు చందమామను తెచ్చిఇస్తాను అంటే ప్రజలు నమ్మలా..చంద్రబాబు ప్రజల కోసం కాదు..పదవి కోసం పథకాలు వేస్తారు.ఇన్ని ఏళ్లు వచ్చిన..ఇన్ని అబద్ధాలు బెబుతున్నా చంద్రబాబు పెద్దమనిషి ఎలా అవుతారు..నిప్పు అని చెప్పుకుంటే..తుప్పు నిప్పు అవుతుందా..సెల్ఫ్‌డబ్బా కొట్టుకుంటే అది వాస్తవం అవుతుందా..చంద్రబాబు ముఖ్యమంత్రిగా తొమ్మిదేళ్లలోనే హైదరాబాద్‌ అభివృద్ధి తానే చేశానని సెల్ఫ్‌డబ్బా కొట్టుకుంటున్నారని,ఐదేళ్ల ముఖ్యమంత్రిగా ఉన్నావు..కాని అమరావతిలో ఒక శాశ్వత భవనం ఎందుకు లేదు.అసత్యానికి మారుపేరు చంద్రబాబు.చేతనైతే నిజం చెప్పండి..వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రత్యేకహోదా ఢిల్లీలో ధర్నాలు చేశారు.

ఆంధ్రలో రోజుల తరబడి నిరాహారదీక్షలు చేశారు.బంద్‌లు,రాస్తారోకోలు,ధర్నాలు,మానవహారాలు,క్యాండిల్‌ ర్యాలీ ఈ ఐదేళ్లలో ఎన్నో చేశారు.వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలు బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాసం కూడా పెట్టారు.రాజీనామాలు కూడా చేశారు.వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఊరురా తిరిగి ప్రత్యేకహోదాపై పోరాటం చేయకపోతే..చంద్రబాబు నోట నుంచి ప్రత్యేకహోదా మాట వచ్చి ఉండేదా..హోదా వద్దు..ప్యాకేజీ కావాలన్నా చంద్రబాబును యూటర్న్‌ తీసుకునేలా చేసింది వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కాదా..చంద్రబాబుకు నిజం చెప్పడం చేతకాదు.ముందు హోదా అంటారు.తర్వాత ప్యాకేజీ అంటారు.ఇప్పుడు మళ్లీ హోదా అంటున్నారు.ముందేమో బీజేపీతో పొత్తు..నేడు కాంగ్రెస్‌తో పొత్తు..చంద్రబాబుది రోజుకో మాట,పూటకో వేషం.ఆయనను చూసి ఊసరవెల్లి కూడా సిగ్గుతో పారిపోతుంది.

ఎన్నికలు వచ్చాయని ప్రజలంతా ఆలోచించాలని,ఒక వైపు తండ్రి లాంటి ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పోడిచినవాడు.ఎన్టీఆర్‌ పార్టీని కబ్జా చేసినవాడు. ఎన్టీఆర్‌ కుటుంబాన్ని వాడుకుని పక్కనపడేసినవాడు. వ్యవసాయం దండగ అన్నవాడు.ఉచిత విద్యుత్‌ను హేళన చేసినవాడు.అప్పులపాలయిన రైతులు బషిర్‌బాగ్‌లో ఆందోళన చేస్తే వారిని కాల్చిపారేసిన వాడు..గత ఎన్నికల్లో ఏఒక్క హామీలు కూడా నిలబెట్టుకోలేదు..నేడు కొత్త హమీలు..నమ్ముతారా..వైయస్‌ జగన్‌ తొమ్మిదేళ్లు  విలువలు కలిగిన రాజకీయాలు చేశారు.కాంగ్రెస్‌ను వీడితే కేసులు పెడతారని అన్నాడే తెలుసు..,అప్పడే బెదిరింపులకు గురిచేశారు. జగనన్న అవినీతే చేసి ఉంటే కాంగ్రెస్‌ పార్టీని వీడేవాడు కాదు.అయినా ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం కోసం ఈ తొమ్మిదేళ్లు ఎన్నో కష్టాలు పడ్డారు.వైయస్‌ఆర్‌సీపీని సగర్వంగా నడిపించారు. 

మంచికి,చెడుకు జరుగుతున్న పోరాటంలో మంచినే గెలిపించాలి.ఆలోచించి ఓటేయాలని కోరుతున్నా..మీ భవిష్యత్‌ నా బాధ్యత అంటున్న బాబు ఐదేళ్లు ఏంచేశారు..పవన్‌కల్యాణ్‌ ఒక యాక్టర్‌.డైరెక్టర్‌ చెప్పిందే యాక్టర్‌ చేస్తారు.పవన్‌కల్యాణ్‌ రాజకీయ సినిమాకు చంద్రబాబే డైరెక్టర్‌..జనసేనకు ఓటేస్తే చంద్రబాబుకు ఓటేసినట్లే..మా ఇంటి పెద్ద వివేకానందరెడ్డి గారిని కిరాతకంగా చంపారు.బాధితులం మేమైతే మా పైనే నిందులు వేస్తున్నారు.మా తాత రాజారెడ్డిని ఇదే మాదిరిగా చంపారు.ఇప్పుడు ఇప్పుడు చంద్రబాబే ముఖ్యమంత్రిగా ఉన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top