వైయస్‌ఆర్‌సిపి సిఇసి సభ్యునిగా జిట్టా

హైదరాబాద్, 12 నవంబర్‌ 2012: నల్గొండ జిల్లాకు చెందిన యువ నాయకుడు జిట్టా బాలకృష్ణారెడ్డిని పార్టీ కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యునిగా నియమించినట్లు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయం సోమవారం ఒక పత్రికా ప్రకటనలో పేర్కొంది. పార్టీ అధ్యక్షుడు వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకం చేసినట్లు పార్టీ తెలిపింది. దీనితో పాటు జిట్టాను హైదరాబాద్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, నల్లగొండ, ఖమ్మం జిల్లాలకు రీజినల్‌ కో ఆర్డినేటర్‌గా కూడా నియమించినట్లు ఆ ప్రకటనలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయం వెల్లడించింది.
Back to Top