వైయ‌స్ఆర్‌సీపీలో నూతన నియామకాలు 

తాడేపల్లి: వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీలో పదవుల భర్తీలో భాగంగా పలు నియామకాలను పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టారు. ఈ మేరకు వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. పార్టీ సీఈసీ సభ్యునిగా పామిరెడ్డిగారి పెద్ద నాగిరెడ్డి(నంద్యాల),  ఎస్‌ఈసీ సభ్యునిగా వైసి గోవర్ధనరెడ్డి(మడకశిర), పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా కంగాటి ప్రదీప్ రెడ్డి (పత్తికొండ), పార్టీ రాష్ట్ర సెక్రటరీ (పార్లమెంటు) పోరెడ్డి నరసింహారెడ్డి (ప్రొద్దుటూరు) నియమితులయ్యారు. 

Back to Top