కూరుకుంటలో పార్టీ పతాకం ఆవిష్కరణ

అనంతపురం: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సంకల్పయాత్ర రాప్తాడు నియోజకవర్గం కూరుకుంటకు చేరుకుంది. కూరుకుంట ఎస్సీ కాలనీలో పార్టీ పతాకాన్ని ఆవిష్కరించిన వైయస్‌ జగన్‌ సమీపంలోని అంధ మహిళల ఆశ్రమాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వైయస్‌ జగన్‌ అంధ మహిళలను కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పెన్షన్‌ వస్తుందా అని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగి ఆశ్రమాన్ని నడపడం అభినందనీయమన్నారు. 
 
Back to Top