<br/>ప్రకాశం: ప‌్రజా సంకల్ప యాత్రలో భాగంగా అంబేద్కర్ కాలనీకి చేరుకున్న వైయస్ జగన్‌కు సమస్యలు స్వాగతం పలికాయి. కాలనీలో కనీస మౌలిక సదుపాయాలు కరువయ్యాయని, తాగేందుకు నీరు లేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్లు వేయడం విస్మరించారని, తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా పట్టించుకోవడం లేదని కాలనీవాసులు వైయస్ జగన్ దృష్టికి తీసుకెళ్లారు. మనందరి ప్రభుత్వం రాగానే అభివృద్ధి చేస్తామని వైయస్ జగన్ హామీ ఇచ్చారు.