టమాట జ్యూస్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తా


అనంతపురం: నష్టపోతున్న టమాట రైతులను ఆదుకునేందుకు ధరల స్థిరీకరణ నిధి, జ్యూస్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి హామీ ఇచ్చారు. బుధవారం వైయస్‌ జగన్‌ టమాట రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ముత్యాలనాయుడు అనే రైతు తమ కష్టాలను వైయస్‌ జగన్‌కు వివరించారు. దళారుల జోక్యంతో నష్టాలపాలవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశాడు. గిట్టుబాటు ధర లేదని, కూలీల రేట్లు విఫరీతంగా పెరిగాయని తెలిపారు. ఎకరాకు పెట్టుబడి రూ.50 వేలు ఖర్చు అవుతుందని చెప్పారు. మన ప్రభుత్వం వచ్చాక రైతులకు మేలు చేస్తామని వైయస్‌ జగన్‌ మాట ఇచ్చారు.
 
Back to Top