మూడో రోజు యాత్ర

వైయ‌స్ఆర్ జిల్లా:  వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్ జగన్‌ మోహన్‌ రెడ్డి ..  ప్రజా సంకల్ప యాత్ర మూడో రోజు షెడ్యూల్ ఇలా ఉంది. మూడోరోజు బుధవారం కమలాపురం నియోజకవర్గంలో పాదయాత్ర చేయనున్నారు.  వేంపల్లి-ప్రొద్దుటూరు రోడ్డు మీదగా నీలతిమ్మాయపల్లి  నుంచి మూడోరోజు యాత్రను ప్రారంభిస్తారు. మొత్తం 16.2 కిలోమీటర్లు సాగే ఈ పాదయాత్ర ఉరుటూరులో ముగియనుంది.కమలాపురం, నీలతిమ్మాయపల్లి, పలగిరి జంక్షన్‌ క్రాస్‌రోడ్డు, సంగమహేశ్వర టెంపుల్‌ జంక్షన్‌, సంగాలపల్లిలో భోజన విరామంతో పాటు విద్యార్థులు, ఉద్యోగులతో భేటీ, అనంతరం పాదయాత్ర తిరిగి ప్రారంభం, గిరిరెడ్డిపల్లిలో సాయి బాబా ఆలయం సందర్శన, అయ్యవారిపల్లి, ఉరుటూరులో వైయ‌స్‌ జగన్‌ రాత్రి బస చేస్తారు.
Back to Top