న్యాయవాదుల సంక్షేమానికి నిధులను పెంచాలి

విజయనగరంః న్యాయవాదుల శ్రేయస్సు కోసం సంక్షేమ నిధులను పెంచడానికి చర్యలు తీసుకోవాలని వైయస్‌ జగన్‌ను న్యాయవాదులు కోరారు. ప్రజా సంకల్పయాత్రలో  ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని కలిసి తమ సమస్యలను విన్నవించారు. న్యాయవాదులకు హెల్త్‌కార్డులు,ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని, జూనియర్‌ న్యాయవాదులకు నెలకు రూ.5 వేల  స్టయిఫండ్‌ ఇచ్చేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. . అర్హులైన న్యాయవాదులకు పింఛన్‌ సౌకర్యం కల్పించాలన్నారు. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో న్యాయవాదుల వెల్ఫేర్‌ ఫండ్‌ తక్కువగా ఇస్తున్నారన్నారు.హైకోర్డును అమరావతికి తీసుకురావాలని కోరారు. గతంలో ప్రభుత్వానికి ఎన్నోసార్లు  మొర పెట్టుకున్నామని అయినా స్పందన కరువైందన్నారు.  వైయస్‌ జగన్‌ తప్పకుండా వచ్చే ఎన్నికల్లో గెలిచి అధికార బాధ్యతలు చేపడతారనే నమ్మకం ఉందన్నారు. ఈ  డిమాండ్లపై వైయస్‌ జగన్‌ సానుకూలంగా స్పందించారని వారు వివరించారు. 
 

తాజా వీడియోలు

Back to Top