జగనన్నే సీఎం కావాలి

తూర్పుగోదావరి: మా ఫస్ట్‌ ఓటు వైయస్‌ జగన్‌కే వేస్తాం. జగనన్న సీఎం అయితేనే విద్యా వ్యవస్థలో మార్పులు వస్తాయి.. చంద్రబాబు ప్రభుత్వంలో ఫీజురియంబర్స్‌మెంట్‌ అందక అవస్థలు పడుతున్నామని కాకినాడ జేఎన్టీయూ విద్యార్థులు అన్నారు. జగ్గయ్యపేట నియోజకవర్గంలో కొనసాగుతున్న ప్రజా సంకల్పయాత్రలో ఇంజనీరింగ్‌ విద్యార్థులు పాల్గొన్నారు. తమ సమస్యలను వైయస్‌ జగన్‌కు చెప్పుకున్నారు. ఈ మేరకు వారు మాట్లాడుతూ.. చంద్రబాబు సర్కార్‌ ఫీజురియంబర్స్‌మెంట్‌ సరిగ్గా అమలు చేయడం లేదని, రాజన్న రాజ్యంతోనే మేలు జరుగుతుందని, విద్యార్థులకు వైయస్‌ఆర్‌ ప్రతి విషయంలో సహకరించేవారని గుర్తు చేశారు. చంద్రబాబు లక్షల్లో ఫీజులు పెంచడంతో ఇబ్బందులు పడుతున్నామన్నారు. వైయస్‌ జగన్‌ మాత్రమే సీఎం కావాలి.. జగనన్న సీఎం అయితేనే ఉచిత విద్య అందుతుందన్నారు. 
 
Back to Top