అంతులేని అభిమానం



శ్రీకాకుళం: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌రెడ్డిపై సిక్కోలు ప్రజలు అంతులేని అభిమానం చూపుతున్నారు. రాజన్న బిడ్డకు అడుగడుగునా గిరిజనులు అపూర్వ స్వాగతం పలికారు. సాంప్రదాయ నృత్యాలతో వైయస్‌ జగన్‌కు ఘన స్వాగతం పలికారు. ప్రజా సంకల్ప యాత్ర 307వ రోజు పాలకొండ నియోజకవర్గంలో కొనసాగుతోంది.

మేళ తాళాలు.. డప్పుల మోతలు.. పెద్ద పులి నృత్యాలు.. కదం తొక్కిన పార్టీ శ్రేణులు.. బారులు తీరిన మహిళలు.. అందరి ముఖాల్లో ఆనందోత్సాహాల మధ్య వైయ‌స్ఆర్‌  కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర  ఆదివారం శ్రీకాకుళం జిల్లాలోకి ప్రవేశించింది. శ్రీకాకుళం సరిహద్దులో జ‌న‌నేత‌కు అపూర్వ స్వాగతం లభించింది. పాలకొండ శాసనసభా నియోజకవర్గంలోని వీరఘట్టం మండలం కెల్ల గ్రామంలోకి జననేత అడుగు పెట్టగానే ఎటు చూసినా కోలాహలమే కనిపించింది. వేలాదిగా తరలి వచ్చిన ప్రజలు, అభిమానులతో ఇరు జిల్లాల సరిహద్దు జనసంద్రంగా మారింది. 

సరిహద్దుకు అటూ ఇటూ ఉన్న పల్లెల్లో దారి పొడవునా జనం వైయ‌స్ జగన్‌కు జేజేలు పలికారు. శ్రీకాకుళం సరిహద్దుల్లోకి అడుగు పెట్టగానే కిలోమీటర్ల మేర మహిళలు బారులు తీరి నీరాజనం పలికారు. అక్కడికి వచ్చిన జనసంద్రాన్ని చూస్తుంటే జగన్‌కు స్వాగతం పలకడానికి మొత్తం జిల్లాయే తరలి వచ్చిందా.. అన్న భావన కలిగింది.  రహదారిలో ఆద్యంతం జనమే. ఎక్కడా ఖాళీ కనిపించ లేదు. జననేత ముందుకు సాగేకొద్దీ వెంట నడిచే వారు, ఎదురొచ్చి స్వాగతం పలికే వారితో పార్వతీపురం (విజయనగరం) – వీరఘట్టం రోడ్డు కిటకిటలాడింది. రోడ్డుకు ఇరు వైపులా వాహనాల్లోంచి పెద్ద ఎత్తున జనం జననేతతో కరచాలనానికి పోటీ పడ్డారు. యువకులు బస్సులపైకెక్కి జై జగన్‌ అంటూ నినాదాలు చేశారు.  
Back to Top