<br/>విజయవాడ: వ‌్యవసాయం పట్ల చంద్రబాబు వైఫల్యం కారణంగా క్రాప్ హాలిడే ప్రకటించాల్సి వచ్చిందని కృష్ణా జిల్లా రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా కృష్ణాజిల్లా రైతులు వైయస్ జగన్‌మోహన్ రెడ్డిని కలిశారు. వేల క్యూసెక్కుల నీరు వృధాగా పోతున్న పట్టించుకోవడం లేదని వారు తెలిపారు. ఏ పంటకు గిట్టుబాటు ధర లేదని ఆందోళన వ్యక్తం చేశారు. మీరు సీఎం కావాలని, రాజన్న రాజ్యం తీసుకురావాలని రైతులు వైయస్ జగన్‌ను కోరారు.