<br/>తూర్పు గోదావరి: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా బుధవారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పని చేస్తున్న ఏఎన్‌ఎంలు, ఆయాలు, ఆశా వర్కర్లు వైయస్ జగన్‌ను కలిశారు. తమకు జీతాలు అరకొరగా ఉన్నాయని, ఉద్యోగ భద్రత లేదని ఆందోళన వ్యక్తం చేశారు. వారి సమస్యలు సావధానంగా విన్న వైయస్ జగన్..వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చాక న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.