గడపగడపలో ప్రజల పార్టీ

రాష్ట్రవ్యాప్తంగా గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగుతుంది. ప్రజల పక్షాన నిరంతరం  పోరాటం కొనసాగిస్తున్న వైయస్సార్సీపీ వారికి కొండంత అండగా నిలుస్తోంది. ఈనేపథ్యంలోనే గడపగడపలో పర్యటించి వారి సాధకబాధలను అడిగి తెలుసుకుంటోంది. బాబు పాలనలో దగాపడిన ప్రజలకు భరోసానిస్తూ ముందుకు సాగుతోంది. 

తూర్పుగోదావరి జిల్లా ముమ్మడివరం నియోజకవర్గ కోఆర్డినేటర్ క్రిష్ణ నీలరేవు గ్రామంలో గడపగడపలో పర్యటించారు. బాబు మోసాలను ఎండగట్టారు. మండపేట నియోజకవర్గంలో వైయస్సార్సీపీ నేత పట్టాభి రామయ్యచౌదరి ఆధ్వర్యంలో గడపగడకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమం సాగింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరించి బాబు రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తున్నారని  మండిపడ్డారు. రానున్న ఎన్నికల్లో టీడీపీకి తగిన బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. 

నరసన్నపేట నియోజకవర్గంలో రాష్ట్ర బీసీ సెల్ అధ్యక్షుడు ధర్మాన క్రిష్ణదాస్ ముమ్మరంగా పర్యటించారు. జలుమూరు మండల్ సురవరం గ్రామపంచాయతీ దోంపాక గ్రామాలలో గడపగడప తిరిగారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రుణాలు మాఫీ కాలేదు. ఉద్యోగాలు లేవు. రేషన్, ఇళ్లు, పింఛన్లు ఏవీ అందడం లేదని ప్రజలు ధర్మాన వద్ద మొరపెట్టుకున్నారు.  మండల ముఖ్యనాయకులూ కార్యకర్తలు ప్రజలు పెద్ద ఎత్తున ఈకార్యక్రమంలో పాల్గొన్నారు.

Back to Top