వైయస్సార్‌ కుటుంబ సభ్యత్వ నమోదులో డాక్టర్‌ సిద్ధారెడ్డి

గాండ్లపెంట (అనంతపురం):

వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆదేశాల మేరకు కదిరి నియోజకవర్గ  సమన్వయకర్త డాక్టర్‌ పివి. సిద్ధారెడ్డి గురువారం మండల కేంద్రంలో వైయస్సార్‌ కుటుంబ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్బంగా పామిడి వీధిలోని గృహాలను సందర్శించి కుటుంబ సభ్యులతో యోగక్షేమాలు తెలుసుకుని తెలుగుదేశం పాలనలో మీకు ప్రభుత్వ పథకాలు అందాయా లేదా అంటు వివరాలు సేకరించారు. ఈ సందర్బంగా కుటుంబ సభ్యులు మాట్లాడుతూ తెలుగుదేశం పాలనలో ఎలాంటి పథకాలు అందలేదని, తీసుకున్న రుణాలకు వడ్డీ చేతి నుంచి చెల్లించామని చెప్పారు. మాకు మేలు జరిగిందంటే ఆ దివంగత నేత వైయస్‌ రాజశేఖరరెడ్డి పాలనలోనే ఆరోగ్య శ్రీ ఆదుకుందని ఆ వీధికి చెందినపామిడి బాషా కుటుంబసభ్యులు తెలియజేశారు.అ ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మండల కన్వీనర్‌ పోరెడ్డిచంద్రశేఖరరెడ్డి, సర్పంచ్‌ కాకర్ల రవీంద్రారెడ్డి, వైస్‌ ఎంపీపీఆదెప్పనాయుడు, మండల నాయకులు మాజీ జడ్పీటీసీ భాస్కరరెడ్డి,మండల నాయకులు, బూత్‌కన్వీనర్లు, పార్టీ ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

Back to Top