రాజన్న రాజ్యం జగనన్నతోనే సాధ్యం

చంద్రబాబుకు గుణపాఠం చెబుతాం
మునగపాక:బాబూ ఈ సారి మోసపోకుండా రాజన్న కొడుకు జగన్ కు అవకాశం ఇస్తాం. ఇచ్చిన హామీలను చంద్రబాబు అమలుచేయలేదు సరికదా చెప్పేవన్ని మోసాలని గమనించాం. రానున్న ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతాం.  ఇవీ మునగపాక బీసీ కాలనీవాసుల మనోభావాలు. వైయస్సార్ కుటుంబ కార్యక్రమం మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల్లోనూ చురుగ్గా సాగుతుంది. దీనిలో భాగంగా మునగపాక బీసీ కాలనీఈలో పార్టీ మండల కన్వీనర్ మళ్ల సంజీవరావు, బూత్కమిటీ కన్వీనర్ దాడిపోలీసు, బూత్కమిటీ సభ్యుడు రాజాన బుజ్జి తదితరుల ఆధ్వర్యంలో ఇంటింటికీ వెళ్లి నవరత్నాల కరపత్రాలను పంపిణీ చేశారు. అలాగే గత ఎన్నికల్లో చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీలు అమలయ్యాయా లేదా అని అడిగి తెలుసుకోవడంతోపాటు పార్టీ ప్రచురించిన రశీదులను నింపి 9121091210 ఫోన్ నంబర్ కు మిస్ డ్ కాల్  ఇప్పించారు. ప్రజల అంగీకారంతో ఇళ్లగోడలపై రాజన్న స్టిక్కర్లను అంటించారు.ఈసందర్బంగా సంజీవరావు మాట్లాడుతూ ...బడుగు, బలహీనవర్గాల సంక్షేమంకోసం జగన్మోహనరెడ్డి నవరత్నాలను ప్రవేశపెట్టారన్నారు. ఈ పథకం ద్వారా అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. మహానేత రాజశేఖరరెడ్డి ఆశయాలు ఆయన తనయుడు జగన్తోనే సాధ్యమవుతుందన్నారు. అలాగే నాగవరం, కాకరాపల్లి, గొల్లపేట, గవర్ల అనకాపల్లి, రాజుపేట, వెంకటాపురం, సిరసపల్లి, చెర్లోపాలెం, మడకపాలెం, రామగిరి, గంటవానిపాలెం తదితర గ్రామాల్లో కూడా కార్యక్రమం కొనసాగుతుంది.
..............................................
కె.కోటపాడు : రాష్ట్రంలో వై.యస్.రాజశేఖరరెడ్డి అందించిన సువర్ణపాలన మరలా జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత రాష్ట్ర ప్రజలకు అందనుందని మాజీ జెడ్పిటిసి ఈర్లె గంగునాయుడు(నాని) అన్నారు. మండలంలో కొత్త అగ్రహరం గ్రామంలో శనివారం వైయస్సార్ కుటుంబం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా గ్రామంలో గల 45 ఇండ్లకు పార్టీ కార్యకర్తలు వెళ్ళి నవరత్నాల సంక్షేమ పథకాల కరపత్రాలను అందించారు.  గంగునాయుడు(నాని) మాట్లాడుతూ...జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత వైయస్సార్ రైతు భరోసా, వైయస్సార్ ఆసరా, ఫించన్ల పెంపు, అమ్మ ఒడి,  ప్రతీ పేదవాడికి ఇళ్ళు, ఆరోగ్యశ్రీ, ఫీజు రీఎంబర్స్మెంట్, జలయజ్ఞం, దశల వారీగా మద్యపాన నిషేద కార్యక్రమాలను అమలు చేయనున్నట్లు వివరించారు. చంద్రబాబుకు ప్రజలు ఓటుతో బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు యడ్ల ముత్యాలనాయుడు, లెక్కల సూర్యనారాయణ, యడ్ల అప్పలనాయుడు, మల్లిఖార్జునరావు తదితరులు పాల్గొన్నారు. 
................................
గిరిజనులంతా వైయస్సార్ కుటుంబంలో చేరాలి
అరకు సమన్వయకర్త చెట్టి పాల్గుణ
హుకుంపేట: దివంగత ముఖ్యమంత్రి వైయస్సార్ మరణాంతరం విశాఖ ఏజెన్సీలో గిరిజనాభివృద్ధి కుంటుపడిందని,తమ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో రాజన్న రాజ్యం తొందరలోనే వస్తుందని,గిరిజనుల సమస్యలన్ని పరిష్కారం అవుతాయని,వైయస్సార్సీపీ అరకు సమన్వయకర్త చెట్టి పాల్గుణ అన్నారు. హుకుంపేట సంతలో శనివారం పార్టీ నాయకులంతా ర్యాలీ నిర్వహించారు. చెట్టి పాల్గుణ గిరిజనులకు నవరత్నాల పథకాలను వివరించారు. వైయస్సార్ కుటుంబంలో చేరేందుకు గాను, గిరిజనులతో 9121091210 నంబర్కు మిస్డ్ కాల్ ఇప్పించారు. కొద్ది సేపటికి పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి సందేశంను గిరిజనులకు వినిపించారు. జగన్ మాటలు విన్న గిరిజనులంతా ఒక్కసారిగా జై జగన్ నినాదాలు చేయడంతో సంత ప్రాంతం హోరెత్తింది. ఈ సందర్భంగా చెట్టి పాల్గుణ మాట్లాడుతూ.... ఇప్పటికే మెజార్టీ గిరిజనులంతా వైయస్సార్సీపీ వెంటే ఉన్నారని,మిగిలిన అన్ని వర్గాల గిరిజనులంతా వైయస్సార్ కుటుంబంలో చేరాలని పిలుపునిచ్చారు. ఇంటింటా టీడీపీ పేరుతో మరోసారి మోసం చేసేందుకు, గ్రామాలకు వచ్చే టీడీపీ నేతలను సమస్యలపై నిలదీయాలని ఆయన కోరారు. 
Back to Top