చంద్రబాబును నమ్మి మోసపోయాం

విశాఖ‌: చ‌ంద్ర‌బాబును న‌మ్మి మోస‌పోయామ‌ని వ‌ల‌సంపేట గ్రామ‌స్తులు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. గురువారం ఆ గ్రామంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ న‌ర్నిప‌ట్నం నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త పెట్ల ఉమాశంకర్‌ గణేష్‌కు గడప గడపకు వైయ‌స్ఆర్ కార్యక్రమం నిర్వ‌హించారు. ఇందులో భాగంగా ఆయ‌న ఇంటింటా ప‌ర్య‌టించి ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు అడిగి తెలుసుకున్నారు. చంద్రబాబు పుణ్య‌మా అంటూ డ్వాక్రా గ్రూపులు ఆగిపోయాయని, ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు రుణాలు మాఫీ చేస్తానని చెప్పడంతో మేమంతా అప్పులు కట్టడం మానేసామ‌న్నారు. ప్ర‌భుత్వం రుణాలు మాఫీ చేయకపోవడంతో వడ్డీతో సహా కడుతున్నామ‌ని వాపోయారు. మరుగుదొడ్డు నిర్మించకపోతే రేషన్‌ కార్డు తీసేస్తామని అధికారులు హెచ్చరించడంతో అప్పులు చేసి ఆగమేఘాల మీద నిర్మాణం చేప‌డితే ఏడాది కావస్తున్నా పైసా ఇవ్వలేదని పలువురు గణేష్‌ దృష్టికి తీసుకువచ్చారు. తాగునీటికి సైతం ఇబ్బందులు పడుతున్నామని, పెరిగిన విద్యుత్‌ ఛార్జీల వలన మరింత ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామ‌ని గ్రామస్తులు ఉమాశంకర్‌ ముందు ఆవేదన వ్య‌క్తం చేశారు. పేదలకు అందించే నిత్యావసర సరకులను ఒకటి ఒకటి తగ్గిస్తూ ఇప్పుడు పూర్తిగానే నిత్యావసరాలను రద్దు చేస్తుందని, ఇక పేదలు ఏవిధంగా బతుకుతారని మండిపడ్డారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు సాగిన గడప గడపకు యాత్రలో ప్రజలు అడుగడున ఉహించని విధంగా ఆదరణ చూపించడంతో నాయుకుల్లో మరింత ఉత్సాహం కనిపించింది. ఈ సంద‌ర్భంగా గణేష్‌ మాట్లాడుతూ మీరు పడుతున్న ఇబ్బందులకు తెలుసుకొవడానికే పార్టీ అధ్య‌క్షులు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి మీ వద్దకు మ‌మ్మ‌ల్ని పంపించార‌ని తెలిపారు. చంద్ర‌బాబు ఇచ్చిన హమీలు ఏమేరకు అమలయాయ్యో తెలుసుకునేందుకు వచ్చామన్నారు. త్వరలో రాజన్న పాలన వస్తుందని గ్రామ‌స్తుల‌కు గ‌ణేష్ భ‌రోసా క‌ల్పించారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు అంకంరెడ్డి జమీలు, పార్టీ నాయకులు సుర్లయోగి, ఎన్‌.రమణ, ఇటంశెట్టి శ్రీను, ఎం.రాంప్రసాద్, సబ్బవరపు వెంకునాయుడు(మునసబ్‌), పైల సునీల్, సాంబమూర్తి, రంబారాంబాబు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
---------------------------
Back to Top