"వైయస్ఆర్ కుటుంబం"లో మమేకం

లింగంగుంట్ల, (హనుమంతునిపాడు): ప్రతి ఒక్కరూ వైయస్ఆర్ కుటుంబంలో సభ్యులుగా చేరాలని గ్రామ పంచాయతీ కన్వీనర్ ఎం. తిరపతయ్య, మాజీ సర్పంచ్ కేతిరెడ్డి కొండారెడ్డిలు కోరారు. బుధవారం లింగంగుంట్ల గ్రామంలో వైయస్ఆర్ కుటుంబం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా 200 కుటుంబాలను వైయస్ఆర్ కుటుంబంలో సభ్యులుగా చేర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్రాన్ని సశ్యశ్యామలం చేసేందుకు నవరత్నాలతో జగనన్న వస్తున్నాడనీ జగనన్నకు తోడుగా ప్రతీ ఒక్కరూ వైయస్ఆర్ కుటుంబంలో చేరాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యురాలు రూతమ్మ, కే వెంకటేశ్వరెడ్డి, తిరపతయ్య, కేతిరెడ్డి కొండారెడ్డి, మత్తయ్య, చిన్న వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

నవరత్నాలతోనే ప్రజల అభివృద్ధి
పెదవెంకన్నపాలెం(పొన్నలూరు): మండలంలోని పెదవెంకన్నపాలెం గ్రామంలో  వైయస్సార్ కుటుంబం కార్యక్రమం నిర్వహిచారు.120 కుటుంబాలను సందర్శించి వైయస్ జగన్ ప్రకటించిన నవరత్నాల పథకాలను ప్రజలకు వివరిస్తూ కరపత్రాలు పంచారు.ఈ సందర్భంగా వైయస్సార్సీపీ నాయకులు మాట్లాడుతూ... జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన నవరత్నాలతో అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి చెందుతారని అన్నారు. ప్రతి ఒక్కరు 91210 91210 నంబర్కు మిస్డ్ కాల్ ఇచ్చి వైయస్సార్ కుటుంబంలో చేరి జగన్ కు అండగా ఉండాలన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు నవులూరి ప్రసాద్,వెంకటేశ్వర్లు,పొన్నగంటి రవణయ్య,బొల్లినేని రోశయ్య,కొంకిముడుసు బాబురావు,చల్లా పరంధామయ్య,సంజీవరావు,పిల్లిపోగు రాజయ్య తదితరులు పాల్గొన్నారు.
Back to Top