పోలంపాడులో గడప గడపకు వైయ‌స్ఆర్‌

నెల్లూరు: కలిగిరి మండలంలోని పోలంపాడు పంచాయతీలో శనివారం గడప గడపకు వైయ‌స్ఆర్‌  కార్యక్రమం జరుగుతుందని వైయ‌స్ఆర్  కాంగ్రెస్‌ పార్టీ జిల్లా స్టీరింగ్‌ కమిటీ సభ్యుడు పాలూరి మాల్యాద్రిరెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి కాటం రవీంద్రరెడ్డిలు శుక్రవారం ఓ సంయుక్త ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి హాజరవుతారని వారు తెలిపారు. నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గోని జయప్రదం చేయాలని కోరారు.

Back to Top