మచ్చుకైనా అభివృద్ధి కానరావడం లేదు

ప‌ల్లెల‌ను విస్మ‌రించిన ప్ర‌భుత్వం
కైకలూరు(కొండంగి): ప‌ల్లెల్లో  వెలుగులు విర‌జిమ్ముతామ‌ని ప్ర‌జ‌ల‌ను సీసీరోడ్ల‌పై న‌డిచేలా చూస్తామ‌ని నేత‌లు, అధికారులు ఊద‌ర‌గొట్ట‌డ‌మే త‌ప్ప మా గ్రామంలో మ‌చ్చుకైనా ఎలాంటి అభివృద్ధి ప‌నులు కాన‌రావ‌డం లేద‌ని క‌లిదిండి మండ‌లం కొండంగి ప్ర‌జ‌లు వాపోయారు. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వైయ‌స్సార్ కాంగ్రెస్ కార్య‌క్ర‌మంలో భాగంగా వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ కైకలూరు నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త దూలం నాగేశ్వ‌ర‌రావు గ్రామంలో పర్య‌టించారు. చంద్ర‌బాబు మోస‌పూరిత హామీల‌తో అధికారంలోకి వ‌చ్చి.. ప్ర‌జ‌ల‌ను, గ్రామాల‌ను విస్మ‌రిస్తున్నార‌ని ధ్వ‌జమెత్తారు

అంతా నిర్ల‌క్ష్య‌మే....
క‌ర్నూలు(ఆళ్ల‌గ‌డ్డ‌): చ‌ంద్ర‌బాబు స‌ర్కార్ ప్రతీ పనిలో నిర్ల‌క్ష్య‌మే ద‌ర్శ‌న‌మిస్తుంద‌ని ఆళ్ల‌గ‌డ్డ నియోజ‌వ‌క‌ర్గ ఇంచార్జ్ డాక్ట‌ర్ రామలింగారెడ్డి అన్నారు. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వైయ‌స్సార్ కాంగ్రెస్ కార్య‌క్ర‌మంలో భాగంగా ఆయ‌న ప‌డ‌కండ్లలో ప‌ర్య‌టించారు. చంద్ర‌బాబు స‌ర్కార్ ప్ర‌జ‌ల‌కు ఉప‌యోగ‌ప‌డే ఒక్క ప‌థ‌కం కూడా ప్ర‌వేశ‌పెట్ట‌డం లేద‌న్నారు. అనంత‌రం చంద్ర‌బాబు మోస‌పూరిత హామీల‌పై వందప్ర‌శ్న‌ల‌తో కూడిప ప్ర‌జాబ్యాలెట్‌ను అంద‌జేసి చంద్ర‌బాబు పాల‌న‌పై మార్కులు వేయించారు. ఈసందర్భంగా బాబు పాలనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రజలు సున్నా మార్కులు వేశారు. 

ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజలకు వివరణ
కుప్పం: చిత్తూరు జిల్లా కుప్పం మండలం గంగిచీనేపల్లి గ్రామంలో ఈ ఉదయం గడపగడపకూ వైయస్సార్సీపీ కార్యక్రమం నిర్వహించారు. నియోజకవర్గ ఇంచార్జ్ చంద్రమౌళి ఆధ్వర్యంలో పార్టీ నేతలు, కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి పార్టీ కార్యక్రమాలను వివరించడంతో పాటు ప్రభుత్వ వైఫల్యాలను తెలియజేస్తున్నారు. ప్రజలు అధిక సంఖ్యలో ముందుకు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వారి సమస్యలను నేతల ముందు ఏకరువుపెడుతున్నారు.
Back to Top