బాబు అవినీతి పాలనకు అంతం తప్పదు

చంద్ర‌బాబును ప్ర‌జ‌లు మ‌న్నించ‌రు
క‌ర్నూలు జిల్లా) గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమంలో భాగంగా  కర్నూలు నగర ఇంఛార్జ్ హఫీజ్ ఖాన్ ప్రకాశ్ నగర్ , ఎస్బీఐ కాలనీలో పర్యటించారు. ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా  మాట్లాడుతూ..బాబు అవినీతి పాలనను ప్రజలు గుర్తించారని, త్వరలోనే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ప్రతీ గడపలో ప్ర‌జ‌లు స‌మ‌స్య‌లు విన్న‌విస్తున్నారంటే చంద్ర‌బాబు పాల‌న ఎంత ఘోరంగా ఉందో అర్థ‌మౌంతోంద‌న్నారు. త్వ‌ర‌లోనే వైయ‌స్ జ‌గ‌న్ పాల‌న వ‌స్తుంద‌ని, ప్ర‌జ‌లు అధైర్య ప‌డ‌వ‌ద్ద‌ని భరోసా ఇచ్చారు.  కార్య‌క్ర‌మంలో వైయ‌స్ఆర్ సీపీ నాయ‌కులు క‌ార్య‌క‌ర్త‌లు పాల్గొన్నారు. 

వైయస్సార్సీపీ...ప్రజల పార్టీ
ప్రకాశం(మార్కాపురం): ఎమ్మెల్యే జంకె వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా మార్కాపురం మండ‌లంలో గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు వైయ‌స్సార్ కాంగ్రెస్ కార్య‌క్ర‌మం జ‌రిగింది. ప్ర‌జ‌ల‌కు అండ‌గా నిరంతరం వైయ‌స్ఆర్ సీపీ పోరాటం చేస్తుంద‌ని ఎమ్మెల్యే తెలిపారు.  ప్ర‌జ‌ల ప‌క్షాన నిలిచే పార్టీ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు. హామీల అమలు కోసం ప్రభుత్వంపై పోరాడుదామని ప్రజలకు పిలుపునిచ్చారు.   కార్య‌క్ర‌మంలో వైయ‌స్ఆర్ సీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 

Back to Top