ఏపీని కాపాడటమే వైయస్‌ఆర్‌సీపీ తక్షణ కర్తవ్యం..


ప్రశ్నించే నైతిక హక్కు కాంగ్రెస్,టీడీపీలకు లేవు..
వైయస్‌  జగన్‌ను విమర్శించే స్థాయి, అర్హత లోకేష్‌కు లేదు..
నారా కుటుంబం అవినీతిలో కూరుకుపోయింది..
వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు..

విజయవాడః చంద్రబాబును ఓడించి ఏపీ ప్రజలను కాపాడటమే వైయస్‌ఆర్‌సీపీ  కర్తవ్యమని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. విజయవాడ వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.  వైయస్‌ఆర్‌సీపీ తెలంగాణలో ఎందుకు పోటీ చేయడం లేదని, వైసీపీ,జనసేన, బీజేపీ కలిసిపోయాయంటూ నారా చంద్రబాబు నాయుడు,పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి విమర్శలకు సూటిగా సమాధానం చెప్పారు. ఏపీని వైయస్‌ఆర్‌సీపీ క్షేత్రస్థాయిగా నిర్ణయించుకుందని తెలిపారు. చంద్రబాబు కబంధ హస్తాలలో నలిగిపోతున్న ఆంధ్ర ప్రజలను విముక్తి చేయాలనే ఉద్దేశ్యంతో వైయస్‌ఆర్‌సీపీ ఉందన్నారు. పది తలల రావణసురుడైన చంద్రబాబును రాజకీయంగా వధించి ఏపీకి రక్షణ కల్పించాలనే పట్టుదలతో వైయస్‌ఆర్‌సీపీ ఉందని తెలిపారు.తెలంగాణలోనూ  వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి, వైయస్‌ఆర్‌సీపీ అభిమానులు ఉన్నారని ఏపీని క్షేత్రస్థాయిగా చేసుకుని అహర్నిశలు శ్రమించడం వలనే తెలంగాణలో పోటీకి పెట్టలేకపోయామని స్పష్టం చేశారు. తెలంగాణలో వైయస్‌ఆర్‌సీపీ పోటీ చేయడంలేదని గతంలోనే ప్రకటించామని గుర్తుచేశారు ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌ రెండుపార్టీలకు కేంద్ర కార్యాలయంగా మారిందని,ఇష్టం వచ్చినట్లు రెండువైపుల  నారా వారూ,పీసీసీ వారూ మాట్లాడుతున్నారన్నారు. ఒక వేళ తెలంగాణలో వైయస్‌ఆర్‌సీపీ తెలంగాణల పోటీ పెట్టి ఉంటే  మైనార్టీలు,ఎస్సీ,ఎస్టీ ఓట్లు చీల్చీ బీజేపీకి,టీఆర్‌ఎస్‌కు లబ్ధిచేకూరుస్తున్నారని కూడా చంద్రబాబు,రఘువీరారెడ్డి ఆరోపించేవారన్నారు. బడుగు, బలహీన వర్గాలలో వైయస్‌ఆర్‌సీపీ ప్రాముఖ్యం కలిగిన పార్టీ వైయస్‌ఆర్‌సీపీ అని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను రక్షించి తెలంగాణపైనా కూడా దృష్టి పెడతామని చెప్పారు. తెలుగువారి ఆత్మగౌరవం కోసం ఎన్టీఆర్‌ స్థాపించిన తెలుగుదేశం పార్టీని ఇందిరాగాంధీ మనవడైనా రాహుల్‌ గాంధీ పాదాల కింద ఎందుకు పెట్టారో చంద్రబాబు తెలుగు ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. బాధ్యత కూడాలేదా. 119 సీట్లులో ముష్టి 13 సీట్లు తెచ్చుకుని తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడతావా అని ప్రశ్నించారు. ఎందుకు కాంగ్రెస్‌తో చంద్రబాబు కలిశారో  అందరికి తెలిసిన సత్యమన్నారు. రాష్ట్రం విడిపోవడానికి కారణం కాంగ్రెస్‌ పార్టీ కాదా అని ప్రశ్నిస్తూ ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా  అడ్డగోలు విభజించిన కాంగ్రెస్‌తో లాలూచీ పడటం సిగ్గుచేటన్నారు. వైయస్‌ఆర్‌సీపీ తెలంగాణలో ఎందుకు పోటీచేయడం లేదు అని అడిగే నైతిక హక్కు చంద్రబాబుకు, కాంగ్రెస్‌ పార్టీకి  లేదని మండిపడ్డారు. కోట్లకు కోట్లు  మింగేసి ఆంధ్ర అన్నా హజారే అంటూ గొప్పలు చెప్పుకునే చంద్రబాబు 31 మంది ముఖ్యమంత్రుల్లో  అత్యధిక ధనవంతుడు చంద్రబాబు నాయుడే అని నివేదికలు చెబుతున్నాయన్నారు. తెలిసింది. ఆస్తుల ప్రకటనలో కూడా పొంతనలేని లెక్కలు చెబుతున్నారని దుయ్యబట్టారు. తండ్రి చంద్రబాబు దగ్గర శిక్షణ తీసుకుని అబద్ధాలు చెప్పడంతో కుమారుడు లోకేష్‌ కూడా సిద్ధహస్తుడయాడని విమర్శించారు. చంద్రబాబు ఆస్తులను ప్రకటించిన రోజున అబద్ధాల దినోత్సవంగా జరుపుకోవాలన్నారు..లోకేష్‌ గతంలో ఇచ్చిన అఫిడవిట్‌లో రూ. 330.14 కోట్లు ఆస్తిగా పేర్కొన్నారని,  ప్రజలకు చెప్పేటప్పుడు 26.39 అని వెల్లడిస్తారని విమర్శించారు.  ఇందులో రహస్యం ఏమిటో చెప్పాలన్నారు.  మాటలు రాని చంద్రబాబు మనవడు దేవాన్ష్‌ ఆస్తి గత ఏడాది రూ.11.54 కోట్లు అని, నేడు రూ. 18.74 కోట్లకు ఎలా పెరిగిందని ప్రశ్నించారు. అవినీతిని సొమ్మును చంద్రబాబు కొడుకు,మనవడు పేరు మీద పెట్టి వారిని కూడా  భ్రష్టులను చేస్తున్నారన్నారు. మట్టి,ఇసుక,ప్రాజెక్టులో విచ్చలవిడిగా అవినీతి జరుగుతుందని  ఆ సొమ్మును  బీనామీపేరు మీద పెట్టావని ఆగ్రహం వ్యక్తం చేశారు.  హైదరాబాద్‌లో చంద్రబాబు నిర్మించుకున్న ఇంద్రభవనం విలువ 18 కోట్లు పేర్కొన్నారని, వేల కోట్ల రూపాయలతో నిర్మించుకున్న భవనాన్ని రహస్యంగా పెట్టుకున్న  మహానుభావుడు చంద్రబాబు అని అన్నారు.  వందల కోట్ల రూపాయాలు విలువైన భవనం కేవలం రూ. 18 కోట్లు రూపాయలతోనే నిర్మించుకున్న ఇల్లును నిజాయతీ, చిత్తశుద్ధి ఉంటే అందరికి  చూపించాలని అప్పుడు చంద్రబాబు  బండారం బయటపెడుతుందన్నారు. నారా అవినీతిలో కూరుకుపోయిన కుటుంబం అని అన్నారు.వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి గురించి మాట్లాడే అర్హత, స్థాయి నారా లోకేష్‌కు లేన్నారు.  ప్రజలు సరైన సమయంలో చంద్రబాబుకు  బుద్ధి చెబుతారన్నారు

Back to Top