వైయస్ఆర్ సీపీలోకి విక్రాంత్ రెడ్డి

హైదరాబాద్ 21 నవంబర్ 2012 : తెలంగాణ జాగృతి రాష్ట్ర కార్యదర్శి విక్రాంత్‌రెడ్డి బుధవారం వైయస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. సుమారు 400
మంది అనుచరులు, కార్యకర్తలతో ఆయన మిర్యాలగూడ నుంచి ఊరేగింపుగా బయలుదేరి వైయస్ఆర్ సీపీ కేంద్ర
కార్యాలయానికి వచ్చారు. విక్రాంత్‌రెడ్డికి, ఆయన అనుచరులకు పార్టీ కేంద్ర
పాలక మండలి సభ్యుడు వై.వి.సుబ్బారెడ్డి కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. వైయస్ఆర్ సీపీ సీజీసీ సభ్యుడు కె.కె.మహేందర్‌రెడ్డి, సీఈసీ సభ్యుడు
జిట్టా బాలకృష్ణారెడ్డి, నల్లగొండ జిల్లా నేతలు బీరవోలు సోమిరెడ్డి, పాతూరి
కరుణ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Back to Top