సీమాంధ్రలో వైయస్ఆర్‌సీపీకే అధిక ఎంపీ సీట్లు

న్యూఢిల్లీ:

‘కాంగ్రెస్‌ పార్టీకి ఆంధ్రప్రదేశ్ కంచుకోట అనేది ఇక చరిత్రకే పరిమితం కానుందని, తెలంగాణలో టీఆర్‌ఎస్, సీమాంధ్రలో వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీలు సార్వత్రిక ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించనున్నాయి’ అని ఇండియూ టు డే గ్రూపు/ సీఓటర్ తాజా సర్వే తేల్చి‌ చెప్పింది. తెలంగాణ బిల్లుకు పార్లమెంటు ఆమోదం తెలిపిన నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికలు సైతం జరగనున్న ఈ ప్రాంతంలోని ఓటర్ల మనోగతంపై ఈ సర్వే నిర్వహించారు. దీని ప్రకారం ఈ ప్రాంతంలో జాతీయ పార్టీలు వెనుకబడిపోయి తమిళనాడు, బీహార్, ఉత్తరప్రదేశ్‌లో మాదిరి ప్రాంతీయ పార్టీలు ముందంజలో నిలువనున్నాయి.

సీమాంధ్రలో శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి నేతృత్వంలోని వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ బలమైన రాజకీయ శక్తిగా అవతరించను‌న్నది. సీమాంధ్రలోని 25 లోక్‌సభా స్థానాలకు గాను వైయస్ఆర్‌సీపీ 18 చోట్ల విజయదుందుభి మోగించనున్నది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే సమైక్యాంధ్రప్రదేశ్ ప్రజల్లో అధికశాతం మంది ఇప్పటికీ దివంగత మాజీ ముఖ్యమంత్రి‌, మహానేత డాక్టర్ వై‌యస్ రాజశేఖరరెడ్డే తమకు ఇష్టమైన ముఖ్యమంత్రి అని చెప్పడం. వై‌యస్ఆర్ జీవించి ఉంటే తెలంగాణ ఏర్పడేది కాదని క్షేత్రస్థా‌యిలో ప్రజలు భావిస్తుండటమే ఇందుకు కారణం కావచ్చు. సీమాంధ్రలో కంటే తెలంగాణ ప్రాంతంలో ఆయనకు ఎక్కువ ప్రజాదరణ ఉండటం మరింత ఆసక్తి కలిగించే అంశం.

Back to Top