డ్వాక్రా మహిళల ధ‌ర్నాకు వైయ‌స్ఆర్‌సీపీ మ‌ద్ద‌తు

అనంత‌పురం:  డ్వాక్రా మహిళల‌కు రుణం మంజూరు అయినా వాటిని డ్రా చేయటానికి అనుమంతిచటం లేదంటూ మ‌హిళ‌లు ఆందోళ‌న‌కు దిగారు. వారి ధ‌ర్నాకు వైయ‌స్ఆర్‌సీపీ మ‌ద్ద‌తుగా నిలిచింది. అనంతపురానికి చెందిన 16 డ్వాక్రా సంఘాలకు దాదాపు కోటి రూపాయల రుణం మంజూరు అయ్యింది. అయితే డబ్బు డ్రా చేయటంలో వారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రాప్తాడు ఏపీఎం గోపాల్‌, సీసీ అన్నపూర్ణలు డబ్బు డ్రా చేయటానికి అనుమతించటం లేదు. దీంతో చిన్మయ్‌ నగర్‌కు చెందిన కొందరు డ్వాక్రా మహిళలు డీఆర్‌డీఏ కార్యాలయానికి చేరుకుని ధర్నా చేపట్టారు. ఈ ధర్నాకు వైయ‌స్ఆర్‌సీపీ  మద్దతు తెలిపింది. తొమ్మిది నెలలుగా సమస్య ఉన్నా మంత్రి పరిటాల సునీత పట్టించుకోవటంలేదని డ్వాక్రా మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. 
Back to Top