విద్యాసంస్థల బంద్ విజ‌య‌వంతం

క‌డ‌ప‌: వైఎస్సార్ సీపీ పిలుపు మేర‌కు క‌డ‌ప లో జ‌రిగిన బంద్ విజ‌య‌వంతం అయింది. నారాయ‌ణ కాలేజీలో ఇద్ద‌రు విద్యార్థినుల ఆత్మ‌హ‌త్య‌కు కార‌కులైన యాజ‌మాన్యం పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, మంత్రి నారాయ‌ణ ను అరెస్టు చేయాల‌ని వైఎస్సార్ సీపీ డిమాండ్ చేసింది. ఈ ఆందోళ‌న లో భాగంగా క‌డ‌ప న‌గ‌రంలో బంద్ పాటించారు. ఇత‌ర ప‌ట్ట‌ణాల్లో కూడా విద్యాసంస్థల బంద్ పాటించారు.

స్వ‌చ్ఛందంగా స‌హ‌క‌రించిన ప్ర‌జ‌లు
క‌డ‌ప లో వైఎస్సార్‌సీపీ ఇచ్చిన బంద్ పిలుపున‌కు ప్ర‌జ‌లు స్వ‌చ్ఛందంగా స‌హ‌క‌రించారు. కార్యాల‌యాలు, వ్యాపార కేంద్రాలు మూత‌ప‌డ్డాయి. షాపులు, వ్యాపార నిర్వ‌హ‌ణ కేంద్రాల్ని మూసి ఉంచారు. కాలేజీలు, విద్యాసంస్థ‌లు ప‌నిచేయ‌లేదు. ప్ర‌జ‌లు ఎక్క‌డిక‌క్క‌డ బంద్ లో పాల్గొన్నారు. 

విద్యాసంస్థ‌ల బంద్
వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం పిలుపు తో అనేక చోట్ల విద్యాసంస్థ ల బంద్ పాటించారు. పాఠ‌శాల‌లు, క‌ళాశాల‌ల్ని బ‌హిష్క‌రించి ప్ర‌ద‌ర్శ‌న‌లు చేప‌ట్టారు. కార్పొరేట్ విద్యా సంస్థ‌ల దోపిడీను అడ్డుకోవాలంటూ ఆందోళ‌న‌లు నిర్వ‌హించారు. 

పోలీసుల ఓవ‌రాక్ష‌న్‌
క‌డ‌ప బంద్ సంద‌ర్భంగా పోలీసులు ఓవ‌రాక్ష‌న్ చేశారు. ప్ర‌జాస్వామ్య‌యుతంగా ఆందోళ‌న చేస్తున్న వైఎస్సార్‌సీపీ నాయ‌కుల్ని అరెస్టు చేశారు. న‌గ‌ర మేయ‌ర్ సురేష్ బాబు, ఎమ్మెల్యే అంజాద్ బాషా ల‌ను గృహ నిర్బంధం చేశారు. విద్యాసంస్థ‌ల బంద్ పాటించిన విద్యార్థి విభాగం నేత‌ల‌పై త‌మ ప్ర‌తాపం చూపించారు.  ప్ర‌జాస్వామ్య హ‌క్కుల్ని కాల‌రాసే విధంగా ప్ర‌వ‌ర్తించారు. స్వ‌చ్చందంగా బంద్ చేస్తున్న స్థానికులకు అడ్డు త‌గిలారు. 
Back to Top