వైయస్ఆర్ కాంగ్రెస్ విస్తృతస్థాయి భేటీ ప్రారంభం

హైదరాబాద్, 18 నవంబర్ 2013:

వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ రాష్ట్ర స్థాయి సమావేశం సోమవారం హైదరాబాద్‌లోని ఖాజా మేన్షన్‌ ఫంక్షన్‌ హాలులో ప్రారంభమైంది. విభజన రాజకీయాలు, సమైక్య ఉద్యమ సెగల నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. పార్టీ సంస్థాగత విషయాలు, పార్టీ చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఈ సమావేశంలో చర్చిస్తారు.

వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి అక్రమ నిర్బంధం నుంచి బయటకు వచ్చిన తరువాత జరుగుతున్న మొదటి విస్తృతస్థాయి సమావేశం ఇదే కనుక అనేక ప్రధానమైన అంశాలు ఇందులో చర్చకు రానున్నాయి. ఈ సమావేశంలో పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ పాల్గొన్నారు.

Back to Top