ఏపీ..నిరుద్యోగుల భండాగారం


– అవినీతిలో ఏపీ నెంబర్‌ వన్‌లో ఉంది
– ఉద్యోగాలు వేరు, ఉద్యోగాలు కల్పించడం వేరు
– ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్, డూయింగ్‌ ఆఫ్‌ బిజినెస్‌ వేరు
– ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం ఎంతో మందికి లాభం చేకూరింది
– ఇప్పుడు రావాల్సింది ఉద్యోగ  విప్లవం 
– నాలుగున్నరేళ్లలో ఏపీకి వచ్చిన పెట్టుబడులు రూ.25 వేల కోట్లే
– 40 లక్షల ఉద్యోగాలు ఎక్కడా? 
– వైయస్‌ జగన్‌ సీఎం అయితేనే ఉద్యోగ విప్లవం

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం నిరుద్యోగుల భండాగారంగా మారిందని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి టి.శివశంకర్‌ పేర్కొన్నారు. చంద్రబాబు సర్కార్‌కు సిగ్గూఎగ్గు లేకుండా పని చేస్తోందని, ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదన్నారు. ప్రత్యేక హోదా వచ్చి ఉంటే ఉద్యోగాలు వచ్చేవని, లక్షల ఉద్యోగాలు కల్పించామని చంద్రబాబు మోసం చేస్తున్నారని మండిపడ్డారు. బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో శివశంకర్‌ మీడియాతో మాట్లాడారు. నాడు పోరాడి ప్రత్యేక హోదాను సాధించి ఉంటే ఈ రోజు ఉద్యోగాల్లో నెంబర్‌ వన్‌గా ఉండేవాళ్లమన్నారు. కానీ మనకు సర్వేలు ఇచ్చిన ప్రమాణికంగా ఉద్యోగాలు కల్పించిన రాష్ట్రంగా ఏపీ నంబర్‌ వన్‌ వచ్చిందని చెప్పుకోవడం సిగ్గు చేటు అన్నారు. నిరుద్యోగులు అత్యధికంగా మన రాష్ట్రంలోనే ఉన్నారన్నారు. అయితే కొన్ని వార్త పత్రికల్లో తప్పుడు పథకాలు రాయడం బాధాకరమన్నారు. ఈజ్‌ ఆఫ్‌ డ్యూయింగ్‌ వేరు, ఎంప్లాయిమెంట్‌ వేరన్నారు. నైపుణ్యం కలవారు ఉన్నారని చెప్పడం వేరన్నారు. ఈజ్‌ ఆఫ్‌ డ్యూయింగ్‌ వేరు..డ్యూయింగ్‌ ఆఫ్‌ బిజినెస్‌ వేరని తెలిపారు. అవినీతిలో ఏపీ ప్రభుత్వం నంబర్‌వన్‌లో ఉందని పలు సర్వేలు తేల్చాయని గుర్తు చేశారు. ఇలాంటి వార్తలు ఎల్లోమీడియాలో కనిపించవన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం ద్వారా చదువుల విప్లవం తెచ్చారన్నారు. ప్రతి ఇంటిలోనూ ఒక ఇంజినీర్, ఒక పోస్టు గ్రాడ్యుయేషన్‌ చదివారని తెలిపారు. ఇప్పుడు విద్యా విప్లవం కాదని, ఉద్యోగ విప్లవం రావాలని చెప్పారు. 2014లో రాష్ట్ర విభజన తరువాత మనకు రావాల్సిన విభజన చట్టంలోని హామీలు అయిన ప్రత్యేక హోదా మన రాష్ట్రానికి వచ్చి ఉంటే ఉద్యోగాలు వచ్చేవన్నారు. ప్రత్యేక హోదా వస్తే ప్రతి జిల్లా ఓ హైదరాబాద్‌లా తయారవుతుందని యువభేరి సభల్లో వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అన్నారని గుర్తు చేశారు. కానీ చంద్రబాబు స్వార్థ ప్రయోజనాల కోసం ప్రత్యేక హోదాను కేంద్రానికి తాకట్టు పెట్టారని మండిపడ్డారు. ప్రభుత్వం నిర్మోమాటంగా, సిగ్గు లేకుండా ప్రతి మీటింగ్‌లోనూ రూ.20 లక్షల కోట్ల ఎంవోలు కుదుర్చుకున్నామని, 40 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. నాలుగున్నరేళ్ల పాలనలో ఏపీకి వచ్చిన పెట్టుబడులు కేవలం రూ.25 వేల కోట్లు మాత్రమే అన్నారు. రాష్ట్ర విభజన సమయంలో అప్పటి  ప్రభుత్వం కమలనాథ కమిటీ వేసిందన్నారు. ఈ కమిటీ లెక్కల ప్రకారం ఏపీలో ఖాళీల సంఖ్య 1.42, 208 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పారన్నారు. ప్రతి ఏటా 70 వేల మంది ఉద్యోగులు పదవీ విరమణ పొందారన్నారు. ఏపీ సర్కార్‌ ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేసిందని ప్రశ్నించారు. టీడీపీ మేనిఫెస్టోలోని 18వ పేజీలో ప్రతి ఏటా ఏపీపీఎస్‌సీకి రెగ్యులర్‌ క్యాలండర్‌ భర్తీ చేస్తామని, డీఎస్సీ ప్రకటిస్తామని, ఎలాంటి ఫీజులు లేకుండా చేస్తామని హామీ ఇచ్చారన్నారు. ఉద్యోగం ఇవ్వకపోతే ప్రతి ఇంటికి రూ.2 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని మాట ఇచ్చి తప్పారన్నారు. ఇంతవరకు నియామకాలు జరగలేదన్నారు. ఏపీపీఎస్‌ఈ ద్వారా 2400 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారని, పేరుకేమో 32 సార్లు నోటిఫికేషన్లు ఇచ్చారన్నారు. పోలీసులు ఉద్యోగాలు 5 వేలు భర్తీ చేశారన్నారు. ఏటేటా పది, ఇంటర్, ఇంజినీరింగ్, ఐటీఐ, వంటి కోర్సులతో 5 లక్షల మంది విద్యార్థులు బయటకు వస్తున్నారన్నారు. ప్రభుత్వం చేసిన సాధికారిక సర్వేలో తప్పుడు లెక్కలు చూపారన్నారు. డీఎస్సీ పరీక్షలు అన్నది నిరుద్యోగులకు ఒక వరం లాంటిదన్నారు. రెండు సార్లు టెట్‌ నిర్వహించి అదిగో డీఎస్సీ, ఇదిగో డీఎస్సీ అంటూ ఊరిస్తున్నారన్నారు. ప్రతిపక్షాలు ఉద్యమాలు చేసినప్పుడు మాత్రమే ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటనలు ఇచ్చి మోసం చేస్తున్నారని విమర్శించారు. నాలుగు సార్లు డీఎస్సీ నోటిఫికేషన్‌ అంటూ మంత్రి గంటా శ్రీనివాస్‌ అభ్యర్థులను గందరగోళంలో నెట్టారన్నారు. ఇంతవరకు గ్రూప్‌–4 పరీక్షలు నిర్వహించలేదన్నారు. నిరుద్యోగుల బంఢాగారంగా తయారైందని మండిపడ్డారు. వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చాక వైయస్‌ జగన్‌ ఉద్యోగాల విప్లవం తెస్తారన్నారు. మోసం చేసిన చంద్రబాబు ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెప్పడం తధ్యమని హెచ్చరించారు. 
 
Back to Top