పంచాయతీలపై పార్టీ జెండా ఎగరాలి: విజయమ్మ

చిలకలూరిపేట 24 జూన్ 2013:

రాష్ట్రంలోని ప్రతి పంచాయతీ కార్యాలయంపైనా  వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా  ఎగరాలని ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ ఆకాంక్షించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు  పార్టీ విజయమే లక్ష్యంగా పార్టీ కేడర్‌ను సమాయత్తం చేసేందుకు చిలకలూరిపేట వచ్చిన ఆమె సోమవారం నిర్వహించిన ప్రాంతీయ సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీమతి విజయమ్మ మాట్లాడుతూ స్థానిక ఎన్నికల్లో సమష్టిగా పని చేసి... పంచాయతీలను గెలిచి పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డికి కానుకగా ఇవ్వాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. చిన్న చిన్న సమస్యలున్నా వాటిని పక్కకు పెట్టి ఎన్నికలకు పనిచేయలని కోరారు. రెండేళ్ళుగా ఎన్నికలు నిర్వహించకుండా జాప్యం చేస్తున్నారని ఆరోపించారు.

ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించకుండా పంచాయతీ ఎన్నికలకు పూనుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని శ్రీమతి విజయమ్మ విమర్శించారు. నవంబర్ వరకూ శ్రీ జగన్మోహన్ రెడ్డి బయటకు రాకుండా ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి కుట్రలు పన్నుతున్నారని ఆమె మండిపడ్డారు. అలా చేస్తే పార్టీని పటిష్టం చేస్తానని కిరణ్ కాంగ్రెస్ అధిష్టానానికి చెప్పారని తెలిపారు. ముఖ్యమంత్రి కుట్ర రాజకీయాలకు ప్రజలే బుద్ది చెప్పాలని ఆమె పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా టీడీపీ నుంచి పలువురు నేతలు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పొన్నూరు నియోజకవర్గంలో నంబూరుకు చెందిన డెల్టా ప్రాజెక్టు కమిటీ ఛైర్మన్ ఉయ్యూరు సతీష్ రెడ్డి ...శ్రీమతి విజయమ్మ సమక్షంలో పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. ఆయనతో పాటు పలువురు టీడీపీ నేతలు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.

Back to Top