బాబు..శేఖ‌ర్‌రెడ్డిల సంబంధాల‌పై ఆధారాలున్నాయి


హైద‌రాబాద్‌: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై వైయ‌స్ఆర్‌సీపీ సీనియ‌ర్ నాయ‌కులు, మాజీ మంత్రి  బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్య‌లు చేశారు. చంద్ర‌బాబుకు శేఖర్ రెడ్డితో ఉన్న సంబంధాలపై తన వద్ద ఆధారాలు ఉన్నాయని బొత్స వెల్లడించారు. ఓ మీడియా ఇంట‌ర్వ్యూలో బొత్స స‌త్య‌నారాయ‌ణ ఆస‌క్తికర విష‌యాలు వెల్ల‌డించారు. నోట్ల రద్దు సందర్భంగా చంద్రబాబు తన ద్వారా  రూ.500 కోట్ల రూపాయల నల్లధనాన్ని మార్చుకున్నారని శేఖర్ రెడ్డి సిబిఐ కి వాంగ్మూలం ఇచ్చినట్లు బొత్స చెప్పారు. సిబిఐ నివేదిక బయట పడితే చంద్రబాబుతో శేఖర్ రెడ్డి కి ఉన్న లింకు బయటపడుతాయ‌ని ఆయ‌న పేర్కొన్నారు. శేఖర్ రెడ్డితో చంద్రబాబు సంబంధాలపై జన సేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపణ చేసి, ఆ త‌రువాత మౌనంగా ఉన్నార‌న్నారు. తాను ఈ విషయం పై ఆరా తీస్తే చాలా వాస్తవాలు బయట పడ్డాయని బొత్స వ్యాఖ్యానించారు. 
Back to Top