'సమైక్య శంఖారావా'నికి అనుమతి ఇవ్వండి

హైదరాబాద్, 7 అక్టోబర్ 2013:

హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ఈ నెల 19న నిర్వహించ తలపెట్టిన 'సమైక్య శంఖారావం' సభకు అనుమతి ఇవ్వాలని వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ ‌నాయకులు నగర పోలీస్ కమిషన‌ర్ అనురా‌గ్ ‌శర్మకు సోమవారం విజ్ఞప్తి చేశారు. ఈ సభకు ఇప్పటికే శాప్ అధికారుల నుంచి అనుమతి తీసుకున్నామని వారు ఈ సందర్భంగా కమిషన‌ర్‌కు వివరించారు. ఆ రోజు మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 8 గంటల వరకు శాంతియుత మార్గంలోనే సభ జరుగుతుందని కమిషనర్‌కు పార్టీ నాయకులు జూపూడి ప్రభాకరరావు, అమరనాథరెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు తెలిపారు.

అయితే.. అనుమతి విషయంలో రెండు మూడు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని పోలీస్ కమిషన‌ర్‌ తమకు హామీ ఇచ్చారని పార్టీ నాయకులు తెలిపారు. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. సమైక్యరాష్ట్రం కోసం వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి భారీ సభను ఈ నెల 19న నిర్వహిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. సమైక్య శంఖారావం సభకు అనుమతి ఇవ్వాలని ఈ నెల 4న డిజిపి ప్రసాదరావును పార్టీ నాయకులు కలిశారు.

Back to Top