శ్రీకాకుళంః టీడీపీ అబద్ధపు హామీలతో ప్రజలను నట్టేట ముంచిందని వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి నాగార్జున రెడ్డి ఆరోపించారు. సాధ్యం కాని హామీలిచ్చి దగా చేసిందని మండిపడ్డారు. ఇసుక నుంచి అమరావతి వరుకు అన్నింటా అక్రమాలు,అవినీతికి టీడీపీ నేతలు పాల్పడుతున్నారన్నారు.ప్రభుత్వ ధనాన్ని తెలుగు తమ్ముళ్లు దోచుతింటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దివంగత మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి అమలుపరిచిన సంక్షేమ పథకాలను ఇప్పటికి ప్రజలు గుర్తుచేసుకుంటున్నారన్నారు.బీజేపీతో తెగతెంపులు చేసుకుని బద్ధశత్రువైన కాంగ్రెస్‌తో టీడీపీ కలవడం నీచ రాజకీయం అని అన్నారు. చంద్రబాబు నాయుడు అవినీతి డబ్బుతో మళ్లీ అధికారంలోకి వస్తామనే ధీమాతో ఉన్నారన్నారు.డబ్బుతో ప్రజలను మభ్య పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ప్రజలు చంద్రబాబుకు బుద్ధిచెప్పె రోజులు దగ్గర పడ్డాయన్నారు.వైయస్ జగన్ ఖచ్చితంగా సీఎం అవుతారని, గొప్ప పాలన అందించి ప్రజల గుండెల్లో చిరస్థాయిలో నిలిచిపోతారన్నారు.