ఏపీలో దళిత చట్టాలు అపహాస్యం


– దళితుల సొమ్మును టీడీపీ కార్యకర్తలు దోచేస్తున్నారు
– ఎస్సీ కార్పొరేషన్‌ అవినీతిమయం
– రూ.800 నిధులు గోలుమాల్‌
– జూపూడి ప్రభాకర్‌ ఓ గజదొంగ
– నిధుల గోలుమాల్‌పై సీబీఐ విచారణ చేపట్టాలి


విజయవాడ:  ఆంధ్రప్రదేశ్లో దళిత చట్టాలు అపహాస్యం అవుతున్నాయని వైయస్‌ఆర్‌సీపీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున మండిపడ్డారు. ఎస్సీ కార్పొరేషన్‌ నిధులు టీడీపీ నాయకులకు దారాధత్తం చేస్తున్నారని, చంద్రబాబు ఓ దొంగ అని విమర్శించారు. 2014 నుంచి 2018వ సంవత్సరం వరకు దళితులకు సంబంధించి రూ.800 కోట్ల నిధులు గోలుమాలు జరిగాయని విమర్శించారు. ఏపీలో దళిత చట్టాలు అపహాస్యం అవుతున్నాయని ఆగ్రహంవ్యక్తం చేశారు. దళితులు, యువతకు చెందాల్సిన డబ్బుల్ని చంద్రబాబు దోపిడీ చేయిస్తున్నారని, తక్షణమే సీబీఐ విచారణ చేపట్టాలని ఆయన డిమాండు చేశారు. ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉంటే వెంటనే సీబీఐ విచారణ చేపట్టాలని సూచించారు. రాష్ట్రంలో దళితులకు సెంట్‌ భూమి ఇవ్వలేదని, ఇల్లు, ఇంటి స్థలం ఇవ్వలేదని, పిల్లలకు స్కాలర్‌షిప్‌లు ఇవ్వలేని స్థితిలో ఈ ప్రభుత్వం ఉందన్నారు. ఇదేనా మీ పరిపాలన అని నిలదీశారు. రాష్ట్రంలో దళితులను బతకనిస్తావా చంద్రబాబు అని ప్రశ్నించారు. సోషల్‌ వెల్‌ఫేర్‌ శాఖలోఅవినీతి పెరిగిపోయిందని, నిధులు గోలుమాల్‌ అయ్యానని, నక్కా ఆనందబాబుకు దమ్ముంటే విచారణకు సిద్ధంకావాలన్నారు. దళితుల డబ్బులను ఎర చూపి మా జీవితాలను నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసిన మంత్రులు పేదలకు అందాల్సిన నిధులను స్వాహా చేస్తున్నారని విమర్శించారు. తక్షణమే వీరందరిపై సీబీఐ విచారణ చేపట్టాలని ఆయన డిమాండు చేశారు. దళితులకు అన్యాయం జరిగితే వైయస్‌ జగన్‌ పోరాటం చేస్తారని హెచ్చరించారు. ఎస్సీ కార్పొరేషన్‌ గోలుమాలుపై వైయస్‌ఆర్‌సీపీ ఉద్యమిస్తుందని చెప్పారు. పెదదండ్లూరులో దళితులపై దాడి జరిగితే చంద్రబాబు ఎందుకు మాట్లాడటం లేదని ఆయన ప్రశ్నించారు. జూపూడి ప్రభాకర్‌ ఓ గజదొంగ అని ఆయన ధ్వజమెత్తారు. వేల కోట్ల స్కాంలో జూపూడి భాగస్వామి అన్నారు.  దళితుల డబ్బులను దండుకోవడానికి జూపూడి చూస్తున్నారని, అందుకే ఆయన నోరు మెదపడం లేదన్నారు. దళితుల్లో ఎవరూ పుడతారని చంద్రబాబు అన్నారని గుర్తు చేశారు. జేసీ దివాకర్‌రెడ్డి కళ్లుమూసుకొని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. 
 
Back to Top