వైయ‌స్‌ఆర్‌సీపీ కార్యాలయం ప్రారంభం

కోవెలకుంట్ల: స్థానిక ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు సమీపంలో ఏర్పాటు చేసిన వైయ‌స్‌ఆర్‌సీపీ మండల పార్టీ కార్యాలయాన్ని బుధవారం జెడ్పీటీసీ గాండ్ల పుల్లయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో పార్టీ కార్యకలాపాలను మరింత వేగవంతం చేసి పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి సిద్ధంరెడ్డి రాంమోహన్‌రెడ్డి, మండల ఇన్‌చార్జ్‌ శింగిరెడ్డి రామేశ్వరరెడ్డి, ప్రధాన కార్యదర్శులు అమడాల భాస్కర్‌రెడ్డి, జోళదరాశి రాంమోహన్‌రెడ్డి, సౌదరదిన్నె సర్పంచ్‌ రమణారెడ్డి, బిజనవేముల ఎంపీటీసీ భీంరెడ్డి ప్రతాప్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌లు ప్రభాకర్‌రెడ్డి, రఘునాథరెడ్డి, చిక్కేపల్లి రామకృష్ణారెడ్డి, పార్టీ నాయకులు ఎల్‌ఐసీ రామసుబ్బారెడ్డి, గార్లపాటి జగదీశ్వరరెడ్డి, మోహన్‌రెడ్డి, ముక్కమల్ల మనోహర్, పుల్లారెడ్డి, దేవరాజు, వెంకటేశ్వర్లు, కలుగొట్ల భూస భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు.

Back to Top