జూలై 2న నెల్లూరు జిల్లా ప్లీనరీ

నెల్లూరు జిల్లా వైయస్సాఆర్‌సీపి ప్లీనరీ సమావేశాన్ని జూలై 2వ తేదీన నిర్వహిస్తున్నట్లు పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వే పల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్దన్‌రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరులోని మాగుంట లే అవుట్‌లో ఉన్న జిల్లా పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నగర ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌యాదవ్‌తో కలసి ఆయన మాట్లాడారు. వైయస్సాఆర్‌ సీపి జిల్లా అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు అన్ని నియోజక వర్గాలలో ప్లీనరీ సమావేశాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ సందర్బంగా జిల్లాలోని 10 నియోజక వర్గాలలో ప్లీనరీ సమావేశాలు నిర్వహించడం జరిగిందన్నారు. ఊహించిన దాని కంటే అధిక సంఖ్యలో ప్రజలు ప్లీనరీ సమావేశాలకు వచ్చి విజయవంతం చేశారన్నారు. జిల్లా ప్లీనరీ సమావేశాన్ని జిల్లా పార్టీ పెద్దలు నెల్లూరు పార్లమెంటు సభ్యులు మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్ణయించడం జరిగిందన్నారు. మొదట ఈ నెల 29న నిర్వహిద్దామని తీర్మానించామన్నారు. కాగా ఆ రోజు కొన్ని కారణాల వలన వాయిదా వేశామన్నారు. జులై 2వ తేదీన ఈ ప్లీనరీ సమావేశాన్ని నెల్లూరు నగరంలోని మాగుంట లే అవుట్‌లో ఉన్న అనిల్‌గార్డెన్‌లో నిర్వహిస్తున్నామన్నారు. ఉదయం 9 గంటలకే ఈ సమావేశం ప్రాంరభం అవుతుందన్నారు. నియోజక వర్గాలలో ప్లీనరీ సమావేశాలను విజయవంతం చేసినట్లు జిల్లా ప్లీనరీ సమావేశాలను విజయవంతం చేయాలన్నారు. అడ్డగోలుగా అవినీతి చేస్తున్న చంద్రబాబు పాలనకు త్వరలోనే చరమగీతం పాడే రోజులు వస్తాయన్నారు. చంద్రబాబు రాష్ట్రంలో చేస్తున్న అవినీతికి ప్రపంచంలో ఎక్కడా అప్పులు కూడా పుట్టటం లేదన్నారు. ఈవిదంగా చంద్రబాబు తీరు ఉంటే అభివృద్దికి వైయస్సార్‌సీపి అడ్డంకి  అంటూనిందలు వేయడం సిగ్గుచేటన్నారు. ప్రధానంగా జన్మభూమి కమిటీల పేరుతో టిడిపి నాయకులు దోచుకు తింటున్నారని ఆరోపించారు. నగర ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌ మాట్లాడుతూ చంద్రబాబుపై ప్రజలలో తీవ్ర వ్యతిరేకత పెరిగిందన్నారు. ప్రజల పక్షాన వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పోరాడుతున్నారన్నారు. ప్రజలు జగన్‌ పాలన కోసం ఎదురు చూస్తున్నారన్నారు. జులై 2వ తేదీ జరగనున్న జిల్లా ప్లీనరీ సమావేశాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జెడ్పీటీసీ ప్రసాద్, విష్టువర్దన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Back to Top