న్యూఢిల్లీ: వైయస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ ఎంపీలు విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిలు బుధవారం రాజ్యసభలో ఆందోళన చేపట్టారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని ఎంపీలు డిమాండు చేశారు. ప్లకార్డులు పట్టుకుని ఎంపీలు నిరసన తెలిపారు. ఎంపీల ఆందోళనతో రాజ్యసభ మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా పడింది.