విజయనగరంః రాష్ట్రంలో సాగుతున్న అరాచక పాలనకు ఎప్పుడు చరమగీతం పాడద్దామా అని ప్రజలు ఎదురుచూస్తున్నారని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి అన్నారు.నందివాని వలస వద్ద తిత్లీ తుపానులో నష్టపోయిన అరటి రైతులు వైయస్ జగన్‌మోహన్ రెడ్డికి వినతిపత్రం ఇవ్వడానికి ఎదురుచూస్తున్నారన్నారు. నియోజకవర్గంలో ప్రజలందరూ అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. పింఛన్లు రాక వృద్ధులు,వికలాంగులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. గృహా నిర్మాణంలో బిల్లులు కూడా మంజూరు అవ్వలేదన్నారు. వైయస్ జగన్‌మోహన్ రెడ్డి అన్నివర్గాలకు న్యాయం జరుగుతుందని ప్రజలు విశ్వాసవ్యక్తం చేస్తున్నారని ఆమె తెలిపారు.