– వైయస్ జగన్ ఎంతో గుండె ధైర్యంతో హైదరాబాద్ వచ్చారు– చంద్రబాబు ప్రవర్తించిన తీరు దారుణం– గవర్నర్ డీజీపీతో మాట్లాడటాన్ని బాబు తప్పుపట్టారు– రాజకీయ పార్టీలు పరామర్శిస్తే తప్పా– టీడీపీ నేతలు ఒక్కరైనా ఇంతవరకు వైయస్ జగన్‌ను పరామర్శించారా?– వీఐపీలకు సెక్యురిటీ ఇచ్చే బాధ్యత లోకల్ పోలీసులదే– ముఖ్యమంత్రి బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారు– మంత్రులు దిగజారి మాట్లాడుతున్నారు– సీపీ ఫుటేజీ ఏమైంది – ఇంత అధ్వానమైన పరిపాలనా? దేశంలో ఎక్కడ చూడలేదు– ఏపీ ప్రభుత్వంపై నమ్మకం లేదు..థర్డ్ పార్టీ ఏజెన్సీ విచారణ చేపట్టాలి

హైదరాబాద్: ప్రతిపక్ష నాయకులు వైయస్ జగన్‌పై జరిగిన దుర్ఘటనను ముఖ్యమంత్రి చంద్రబాబు ఖండించాల్సింది పోయి..ఎదురు దాడికి దిగడం నీచ రాజకీయమని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి మండిపడ్డారు. కత్తి లోతు ఎంతకు పోయిందని మంత్రులు మాట్లాడుతున్నారని, ముఖ్యమంత్రి కంట్రోల్ తప్పి వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు. గవర్నర్‌తో నాలుగేళ్ల పాటు చేయనివి కూడా చేసినట్లు అసెంబ్లీలో చదివించుకొని ఇవాళ ఆయనపై నిందలు వేస్తారా అని ప్రశ్నించారు. చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరు బాధాకరమని ఖండించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్‌తో కలిసి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.
వైయస్ జగన్‌పై జరిగిన దాడిపై యావత్ దేశమంతా గమనిస్తున్నారని బుగ్గన పేర్కొన్నారు. సంఘటన జరిగిన వెంటనే వైయస్ జగన్ ఎంతో ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో, హుందాగా వ్యవహరించారన్నారు. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తనకు తానే నిర్ణయం తీసుకొని హైదరాబాద్‌కు బయలుదేరారన్నారు. ఈ ఘటనపై ఏపీ ప్రభుత్వం స్పందించిన తీరు బాధాకరమన్నారు. ముఖ్యమంత్రి , 40 ఏళ్ల అనుభవం అంటున్న చంద్రబాబు ప్రతిపక్ష నేత మీదా హత్యయత్నం జరిగితే..ఆయన స్పందించిన తీరు ఆశ్చర్యకరమన్నారు. వైయస్ జగన్ దాడి జరిగిన వెంటనే..రాష్ట్రమంతా సంయమనం పాటించాలని కోరారు. గొప్పతనం అన్నది ప్రజలు నిర్ణయిస్తారన్నారు.
గవర్నర్ ఎందుకు డీజీపీపై మాట్లాడారని ముఖ్యమంత్రి ప్రశ్నించడం విడ్డూరంగా ఉందన్నారు. గవర్నర్ ప్రతి ఏటా అసెంబ్లీ సమావేశాలు ప్రారంభించిన ప్రతిసారి మై గవర్నమెంట్ అంటారన్నారు. ఆ రోజు మీ గవర్నమెంట్ సాధించిన విషయాలను ఎందుకు గవర్నర్‌తో చెప్పించారని ప్రశ్నించారు. ఎంతో మంది వివిధ పార్టీల నాయకులు అందరూ కూడా వైయస్ జగన్‌ను పరామర్శిస్తే..మీరేందుకు తప్పుపడుతున్నారని నిలదీశారు. అందరూ ఒకవైపు ఉంటే..మీరొక్కరే ఒక వైపు ఉన్నారన్నారు. మనసులో ఏది ఉన్నా కూడా ముఖ్యమంత్రి పదవికి మర్యాద ఇచ్చే విధంగా వ్యవహరించాలన్నారు. నిన్న మీడియా సమావేశంలో వైయస్ జగన్‌పై దాడిని అవహేళనగా మాట్లాడుతూ..నవ్వుతూ మాట్లాడటం, మూడు గంటల సమయం వృథా అయ్యిందని చెప్పడం ఏంటని ప్రశ్నించారు. కంట్రోల్ తప్పి మీ లోపల ఉన్న భావాలను చంద్రబాబు బయటపెట్టారని మండిపడ్డారు.
కలెక్టర్ కాన్ఫరెన్స్‌లో ఉన్న చంద్రబాబు గంటలోనే డీజీపీతో స్టేట్‌మెంట్ ఇప్పించారన్నారు. ముఖ్యమంత్రి అనుమతి లేనిది డీజీపీ మాట్లాడుతారా అని ప్రశ్నించారు. హత్యకు ప్రయత్నించిన వ్యక్తి వైయస్‌ఆర్‌సీపీ అభిమాని అని డీజీపీ చెప్పారన్నారు. ఏదైన ఘటన జరిగితే సబ్ ఇన్‌స్పెక్టర్ స్థాయి వ్యక్తి కూడా చెప్పరని, మీకు ఎందుకు అంత ఆతృత అని నిలదీశారు. వెంటనే సిట్ టీమ్ ఏర్పాటు చేస్తారా అని ప్రశ్నించారు. మీ ఉద్దేశం తెలియపరిచారని, మీ సబార్డినేటర్ ఆఫీసర్లతో సిట్ ఏర్పాటు చేస్తే ప్రజలు ఏమైనా అమాయకులా అని నిలదీశారు. టీడీపీ నాయకులు ఒక్కరైనా వైయస్ జగన్‌ను పరామర్శించారా అన్నారు. ఎయిర్‌పోర్టు మా కంట్రోల్‌లో లేదని సీఎం అంటున్నారని, సీఐఎస్‌ఎఫ్ వాళ్లు కేవలం ఎయిర్‌పోర్టు భద్రత మాత్రమే చూస్తారని, ఈ విషయం తెలిసి మాట్లాడుతున్నారా? లేదా అని నిలదీశారు. వీఐపీలకు సెక్యూరిటీలకు భద్రత కల్పించాల్సిన బాధ్యత లోకల్ పోలీసులదే అన్నారు. ఇది తెలియకుండా నలభై ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబు ఈ విషయాలు మాట్లాడటం సిగ్గు చేటు అన్నారు. పోలీసులకు సంబంధం లేకుంటే ప్రతి ఏయిర్‌పోర్టులో ఎందుకు పోలీసు స్టేషన్ ఏర్పాటు చేశారన్నారు.
హత్యకు పాల్పడిన వ్యక్తి శ్రీనివాస్ ఎయిర్ పోర్టులో ఉన్న క్యాంటీన్‌లో పని చేస్తున్నారని బుగ్గన గుర్తు చేశారు. ఆ వ్యక్తికి పాస్ ఇవ్వాలంటే లోకల్ పోలీసులు కాండక్ట్ సర్టిఫికెట్ ఇచ్చిన తరువాతే ఎయిర్ పోర్టు అధికారులు పాస్ ఇస్తారన్నారు. వైయస్ జగన్‌తో ఉండాల్సిన చీప్ సెక్యురిటీ ఆఫీసర్ ఎక్కడున్నారని ప్రశ్నించారు. మాకు సంబంధం లేదని ప్రభుత్వం చెప్పడం సరికాదన్నారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ వైయస్ జగన్‌కు బాధ్యత లేకుండా వ్యవహరించడాని అనడం సబబు కాదన్నారు.
వైయస్ జగన్‌కు ఎయిర్ పోర్ట్‌లో భద్రత ఎక్కడుందని, ఎయిర్ పోర్టు సీసీ ఫుటేజ్ ఎక్కడుందని బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రశ్నించారు. పోలీసుల ఏరియా కాదని బాధ్యతరహిత్యంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. డీజీపీ ఈ రకంగా మాట్లాడటం ఎప్పుడు చూడలేదన్నారు. తప్పు ఎలా జరిగిందో చూడాలని, ఇలాంటి ఘటనలు జరుగకుండా చర్యలు తీసుకోవాలి కానీ..ఎదురు దాడికి దిగడం నీచ రాజకీయమన్నారు. ఇలాంటి సంఘటనలు జరిగిన తరువాత వైయస్ జగన్‌ను నాయకులు పరామర్శించడం కూడా తప్పేనా అని ధ్వజమెత్తారు. ఈ ఘటన జరిగిన వెంటనే వైయస్ జగన్ అమ్మా అని అనడం కూడా తప్పుపడుతున్నారని దుయ్యబట్టారు. టీడీపీ ఆఫీస్‌లో నాలెడ్జ్ సెంటర్ పెట్టి తప్పుడు ఫ్లెక్సీలు రూపొందించారన్నారు. రాష్ట్రంలో ఏ ఫ్లెక్సీ కూడా ఒక్క రోజులోనే తొలగిస్తున్నారని, అలాంటిది 11 నెలల క్రితం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ఇవాళ ఎలా వచ్చిందని ప్రశ్నించారు. శ్రీనివాసరాజు వద్ద ఉన్న లెటర్లో పేజీకి, పేజీకి మధ్య సంబంధం లేదన్నారు. ఫ్లెక్సీ ప్యాభ్రికేషన్‌లో గద్ద ఫోటో ఏందని నిలదీశారు. ముఖ్యమంత్రిగా ఆ బాధ్యతలు తీసుకొని పొర పాట్లను గమనించాల్సింది పోయి..చివరకు ముగ్గురు మంత్రులు కత్తి లోతు ఎంత పోయిందని అవహేళనగా మాట్లాడుతారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రథమ చికిత్స చేసేందుకు డ్యూటీ డాక్టర్లు ఉంటారని, వారికి పూర్తిగా తెలియదన్నారు. హుందాతనం వదలిపెట్టి..కండ ఎంత పోయింది. ఎన్ని ఇంచులు తెగిందని పేర్కొనడం సిగ్గు చేటు అన్నారు. వైయస్ జగన్ ఎంతో హుందాగా వ్యవహరించార న్నారు. ఇంత అధ్వాన్నమైన పరిపాలన దేశంలో ఎక్కడ లేదు..ఎప్పుడు చూడలేదని అభిప్రాయపడ్డారు. ఏపీ ప్రభుత్వం తమకు నమ్మకం లేదని, థర్డ్ పార్టీ విచారణ చేపట్టాలని బుగ్గన డిమాండు చేశారు.