సిఎం అవుతాడనే ద్వేషంతోనే హత్యకు కుట్ర– వైయస్‌ జగన్‌ హత్యాయత్నం వెనుక పెద్దల హస్తం
- న్యాయస్థానాన్ని తప్పుదారి పట్టించేలా   ఏ జీ వ్యాఖ్య‌లు
– ఎన్‌ఐఏ, సివిల్‌ ఏవియేషన్‌ చట్టాలు డీజీపీకి తెలియవా?
- డీజీపీ పై న్యాయస్థానం ఆశ్రయిస్తా
విజయవాడ:  నిరంత‌రం ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై అలుపెర‌గ‌ని పోరాటం చేస్తూ..ఏడాదికి పైగా ప్ర‌జా సంక‌ల్ప యాత్ర చేస్తున్న వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్‌కు జ‌నాద‌ర‌ణ పెర‌డ‌గంతో ఆయ‌న సీఎం అవుతాడ‌నే ద్వేషంతోనే హ‌త్య‌కు కుట్ర చేశార‌ని వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి అనుమానం వ్య‌క్తం చేశారు. అక్టోబ‌ర్ 25వ తేదీ విశాఖ ఏయిర్ పోర్టులో వైయ‌స్ జ‌గ‌న్‌పై జ‌రిగిన హ‌త్యాయ‌త్నం ఘ‌ట‌న‌కు సంబంధించి కోర్టులో ఏజీ వ్యాఖ్య‌ల‌ను త‌ప్పుప‌ట్టిన‌ట్లు ఆర్కే తెలిపారు. ఏజీ ప్రభుత్వానికి సంబంధించిన పీడర్‌ అని, చంద్రబాబుకు వ్యక్తిగత పీడర్‌ కాదన్నారు. చట్టాలు తెలుసుకోవాలని సలహా ఇచ్చారు. ఎన్‌ఐఏ యాక్ట్‌ పరిధిలోకి ఈ చట్టం వస్తుందని చెప్పారన్నారు. ఆ చట్టాన్ని చదివి కూడా న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించేలా వ్యవహరించారన్నారు. చంద్రబాబు నాయుడు వైయస్‌ జగన్‌పై జరిగిన హత్యాయత్నం వెనుక ఉన్నారని భావిస్తున్న మాటలు వాస్తవ రూపంలో ఉందన్నారు. ఈ కేసులకు అయ్యే ఖర్చు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని ఏజీకి తెలిపారు. చట్టానికి, న్యాయానికి కట్టుబడి ఉండాలన్నారు. చంద్రబాబు చేసే తప్పులు ఏజీ కప్పిపుచ్చే ప్రయత్నం చేయడం సరికాదన్నారు. 1982 చట్టం, సీవిల్‌ ఏవియేషన్‌ చట్టంలోని సెక్షన్‌ 3లో పేర్కొన్నారు. విమానాశ్రయంలో  ఆస్తులు ధ్వంసం చేసినా, హత్యాయత్నం చేసినా ఎన్‌ఐఏ పరిధిలోకి వస్తుందని చట్టంలో ఉందన్నారు. సెక్షన్‌ –6 ఏం చెబుతుందంటే..ఎయిర్‌పోర్టులో ఇలాంటి ఘటన జరిగితే రాష్ట్ర ప్రభుత్వం కేసు నమోదు చేసి ప్రభుత్వానికి తెలియజేయాలన్నారు. ఆ వెనువెంటనే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సమాచారం ఇవ్వాలన్నారు. 15 రోజుల కాలవ్యవధిలో ఎన్‌ఐఏకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకోవాలని చట్టంలో స్పష్టంగా ఉందన్నారు. చట్టాలు స్పష్టంగా చెబుతున్నా రాష్ట్రానికి చెందిన డీజీపీ ఎందుకు అనుసరించలేదని ప్రశ్నించారు. ఆయనకు యాక్ట్‌ తెలియదా అని నిలదీశారు. తెలియకపోతే ఆయన ఆ పోస్టుకు అర్హులు కాదన్నారు. చట్టం తెలిసి ఉంటే చంద్రబాబు తనపై ఒత్తిడి తెచ్చారని డీఐజీ ఒప్పుకోవాలని డిమాండు చేశారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏమన్నారంటే ఆయన మాటల్లోనే..

◆  వైయ‌స్‌ జగన్ పై జరిగిన హత్యాయత్నం వెనక కుట్ర ఉంది.
◆చంద్రబాబు అవినీతిపై అటు శాసనసభలోను ప్రజాక్షేత్రంలోను వైయ‌స్ జ‌గ‌న్ నిరంతరం పోరాటం ..ప్ర‌తిప‌క్ష నేత  ప్రజాసంకల్పయాత్ర చేస్తున్న నేపధ్యంలో ఆయన సిఎం అవుతాడనే ద్వేషంతోనే హత్యకు కుట్రపన్నారు.
◆కోర్టులో అడ్వకేట్ జనరల్ వ్యాఖ్యల్ని హైకోర్టు తప్పుబట్టింది, మీరు ప్రభుత్వ న్యాయవాది కానీ చంద్రబాబు న్యాయవాది కాదు.
◆ న్యాయస్థానాన్ని తప్పుదారి పట్టించేలా వ్యాఖ్యలు ఏ జీ మాట్లాడారు.
◆ మీకు ఇచ్చే జీతం ప్రజల పన్నుల నుంచి, మీరు చంద్రబాబు ప్రభుత్వ తప్పుల్ని కప్పిపుచడానికి కాదు.
◆ ఎన్ ఐ ఏ యాక్ట్, సివిల్ అవియషన్ యాక్ట్ లు స్పష్టంగా చెప్తున్నా డీజీపీ ఎందుకు ఫాలో కావడం లేదు,
     మీకు చట్టం తెలికపోతే డీజీపీ పోస్ట్ కి అనర్హులు.
◆చంద్రబాబును కాపాడటానికే ఈ కేసును డిజిపి ఏపి పోలీసులు చేతిలోకి తీసుకున్నారు
◆ ఎయిర్ పోర్ట్ లో జరిగిన హత్యాయత్నం కేసును ఎన్ ఐఏకు ఎందుకు అప్పగించలేదు.
.◆హత్యాయత్నం జరిగిన గంటలోపే డిజిపి ఎలా మాట్లాడతారు.
◆ హత్యాయత్నం తప్పుదారి పట్టించడమే మీ ఉద్దేశమా.
◆ పోలీస్ మాన్యువల్ స్పష్టంగా ఉంది, మీకు తెలీదా డీజీపీ.
◆ నేను డీజీపీ పై న్యాయస్థానం ఆశ్రయిస్తా.
◆ ఎఫ్ఐఆర్ నమోదు కాకముందే డీజీపీ ఎలా స్పందించారు.
◆ చంద్రబాబు ఒత్తిడి మేరకే డీజీపీ వ్యవహరించారు.
◆ కేసు ఎన్ ఐ ఏ పరిధిలోకి వెళ్తుంది, అన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తాయి.
◆ హైకోర్టు కూడా ఈ రోజు స్పష్టంగా వ్యాఖ్యనించింది.
◆ కేసు ఎన్ ఐ ఏ పరిధిలోకి వెళ్తే ప్రత్యేక కోర్ట్ విచారణ చేస్తుంది, అప్పుడు అన్ని విషయాలు బయటికి వస్తాయి.
◆చంద్రబాబు నాయుడును కాపాడేందుకే చట్టాలను అతిక్రమించి కేసు రాష్ట్ర పరిధిలో ఉంచే ప్రయత్నం చేస్తున్నారు,
 కానీ ఎన్ ఐ ఏ పరిధిలోకి వెళ్తుంది.
◆ ఈ కేసు సుమోటోగా కూడా కేంద్రం తీసుకుని దర్యాప్తు చేయచ్చు అని హైకోర్టు వ్యాఖ్యనించింది.
◆ఎయిర్ పోర్ట్ విమానంలో ఇలాంటి సంఘటనలు జరిగితే స్టేట్ గవర్నమెంట్ 15 రోజులలోపు ఎన్ ఐ ఏకి అప్పచెప్పాలని చట్టాలు చెబుతున్నాయి.
◆చంద్రబాబు ఇలాంటి దుర్మార్గాలు ఎన్ని ఒడిగట్టినా 2019 ఎన్నికలలో ప్రజల అండతో శ్రీ వైయస్ జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయం.


 

తాజా వీడియోలు

Back to Top