దాహార్తిని తీర్చాలని వైఎస్సార్సీపీ నేతల ధర్నా

ప్రకాశంః వేస‌వి కాలంలో ప్ర‌జ‌లు తాగునీటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ముంద‌స్తు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప‌ట్ట‌ణ అధ్య‌క్షుడు కుప్పం ప్రసాద్ పాలకులను, అధికారులను డిమాండ్ చేశారు. నీటి సమస్యపై ఎన్నిసార్లు విన్నవించినా  ఫ‌లితం లేకపోయింద‌ని  ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.  ప్రజలు తమ గొంతు తడుపుకునేందుకు కిలోమీట‌ర్ల కొద్దీ వెళ్లి నీళ్లు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి దాపురించింద‌ని ఆరోపించారు. నీటిని కొనుగోలు చేయ‌లేని నిరుపేద‌ల ప‌రిస్థితి ఏంట‌ని ఆయ‌న స్థానిక అధికారుల‌ను ప్ర‌శ్నించారు. 

ఒంగోలులో నెల‌కొన్న మంచినీటి ఎద్దడి నివార‌ణ‌కు చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని స్థానిక ప్ర‌జ‌ల‌తో క‌లిసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు, కార్య‌కర్త‌లు  ర‌హ‌దారిపై ధ‌ర్నా చేప‌ట్టారు. ఒంగోలులో తీవ్రనీటి ఎద్ద‌డి నెల‌కొన్నా అధికారులుగానీ, ప్ర‌జాప్ర‌తినిధులుగానీ ప‌ట్టించుకున్న పాపాన పోలేద‌న్నారు.  ప్ర‌జ‌ల‌కు క‌నీసం తాగునీటి అవ‌స‌రాల‌ను కూడా తీర్చ‌లేని ప్ర‌భుత్వం ఉంద‌ని ఆయ‌న ఎద్దేవా చేశారు. 


To read this article in English: http://goo.gl/Qh4JGf 

తాజా ఫోటోలు

Back to Top