<strong>ఇంటింటికి నవరత్నాలు ప్రచారం..</strong><strong>రాష్ట్రవ్యాప్తంగా రావాలి జగన్–కావాలి జగన్ కార్యక్రమం కొనసాగుతుంది. నియోజకవర్గాల్లో పార్టీనేతలు, కార్యకర్తలు గ్రామాల్లో పర్యటించి వైయస్‌ఆర్‌సీపీ నవరత్నాలపై ప్రజలకు అవగాహన కలిగిస్తున్నారు. విశాఖ జిల్లా 1వ వార్డు చినగదిలి రాధాకృష్ణ నగర్‌లో వైయస్‌ఆర్‌సీపీ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త శ్రీనివాస వంశీకృష్ణ ఆధ్వర్యంలో రావాలి జగన్–కావాలి జగన్ కార్యక్రమం నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవు మండలం జార్జిపేటలో ముమ్మిడివరం నియోజకవర్గం వైయస్‌ఆర్‌సీపీ కోఆర్డీనేటర్ పొన్నాడ వెంకట సతీష్‌కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన కావాలి జగన్–రావాలి జగన్ కార్యక్రమంలో పార్టీనేతలు రాయుడు గంగాధర్,గోవిందరాజులు, రెడ్డి షణ్ముఖుడు తదితరులు పాల్గొన్నారు. పి.గన్నవరం మండలం కె.ఏనుగుపల్లి గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో వైయస్‌ఆర్‌సీపీ నియోజకవర్గ కోఆర్డీనేటర్ కొండేటి చిట్టిబాబు,ఎం.మోహన్‌రావు,పికె రావు, నక్కా వెంకటేశ్వరరావు, కొమ్ముల కొండలరావు తదితరులు పాల్గొన్నారు. పశ్చిమగోదావరి జిల్లా జీలుగుమిల్లి మండలం రాచన్నగూడెం,లంకాలపల్లి గ్రామాల్లో పోలవరం నియోజకవర్గం వైయస్‌ఆర్‌సీపీ కన్వీనర్ తెల్లం బాలరాజు ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతపురం జిల్లా కనేకల్ మండలం ఆదిగానీపల్లి గ్రామంలో మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతపురం 41వ డివిజన్‌లో నిర్వహించిన రావాలి జగన్–కావాలి జగన్ కార్యక్రమంలో మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి పాల్గొన్నారు. కదిరి పట్టణం సైదాపురంలో నిర్వహించిన కార్యక్రమంలో వైయస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త డా.సిద్ధారెడ్డి పాల్గొన్నారు.</strong>