చంద్రబాబుకు టాలీవుడ్‌ మద్దతు లేదు

– సినీ ప్రముఖులు సీఎంను ఎందుకు కలిశారో సమాధానం చెప్పాలి
– ఉద్యమాన్ని అడ్డుకుంటే చంద్రబాబును క్షమించరు
హైదరాబాద్‌: ముఖ్యమంత్రి చంద్రబాబుకు టాలీవుడ్‌ మద్దతు ప్రకటించలేదని, సినీ ప్రముఖులు ఆయనను ఎందుకు కలిశారో సమాధానం చెప్పాలని వైయస్‌ఆర్‌సీపీ నాయకులు విజయచందర్‌ ప్రశ్నించారు. ఏ ఒక్క రాజకీయ పార్టీకి టాలీవుడ్‌ మద్దతు తెలపదని, వ్యక్తిగతంగా ఎవరైనా, ఏ పార్టీకైనా మద్దతు ప్రకటించవచ్చు అన్నారు. ఇటీవల సినీ ప్రముఖులు కే.రాఘవేంద్రరావు, అశ్వనీదత్, కేఎల్‌ నారాయణ, వెంకటేశ్వరరావు, జెమిని కిరణ్, జీకే చంద్రబాబును కలిసి సినీ పరిశ్రమ తరఫున మద్దతిస్తున్నామని చెప్పడాన్ని ఆయన ఖండించారు. ఈ మేరకు సోమవారం విజయచందర్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.  చంద్రబాబును ఇటీవల సినీ ప్రముఖులు కలిసిన విషయంలో పేపర్‌లో వచ్చిన దానికి క్లారిటీ ఇవ్వాలని కోరారు. ఇండస్ట్రీ తరఫున వెళ్లారా?వ్యక్తిగతంగా సీఎంను కలిశారో సమాధానం చెప్పాలన్నారు. చంద్రబాబు ప్రభుత్వానికి మద్దతిస్తున్నది  వాస్తవం కాదన్నారు. ఈ విషయంలో కేఎల్‌ నారాయణ ఒక్కరే స్పందించి వ్యక్తిగతంగా కలిశామన్నారు.  నారాయణ క్లారిటీ ఇచ్చారు కాబట్టి ఆయన గురించి మాట్లాడటం లేదన్నారు. మిగతా వారు ఎందుకు స్పందించడం లేదన్నారు. ఎట్టి పరిస్థితిలోనూ రాజకీయ పార్టీలకు ముకుమ్మడిగా మద్దతిచ్చిన సందర్భం లేదన్నారు. చంద్రబాబును కలిసిన మిగిలిన నలుగురు వ్యక్తులు క్లారిటీ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. చంద్రబాబు అధికారం కోసం ప్రజలను మభ్యపెట్టడం సరికాదన్నారు. హోదా సాధనకు ప్రజలు చేస్తున్న ఉద్యమాన్ని అడ్డుకోవద్దని హితవు పలికారు. చంద్రబాబు ఒక్కసారి ఆలోచించాలని, మీ కోడుకు కోసం చాలా తాపత్రయపడ్డారని, ఐదు కోట్ల మంది ప్రజలు కూడా వారి పిల్లల జీవితాల కోసం పోరాటం చేయడం తప్పా అని నిలదీశారు. 
 
Back to Top