ధర్మపోరాట దీక్షలు కాదు.. నయవంచక దీక్షలు..

 
వైయస్‌ఆర్‌సీపీ నేత తమ్మినేని సీతారాం..
శ్రీకాకుళంః ప్రజలు ఇచ్చిన అ«ధికారాన్ని అవినీతి,అక్రమాలతో చంద్రబాబు దుర్వినియోగం చేస్తున్నారని  వైయస్‌ఆర్‌సీపీ నేత తమ్మినేని సీతారాం ధ్వజమెత్తారు.తిత్లీ తుపాను బాధితులకు టీడీపీ ప్రభుత్వం ఏమి చేసిందని ప్రశ్నించారు. టీడీపీ ప్రభుత్వంపై కేంద్రానికి విశ్వసనీయత లేదు కాబట్టే నిధులు మంజూరు చేయడంలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం భరించి ప్రజలను ఆదుకోవాలన్నారు. లేకపోతే  వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత  ప్రతి ఒక చివరి బాధితుడి వరుకు నష్టపరిహారం అందిస్తామని వైయస్‌ జగన్‌ ప్రకటన పట్ల హర్షం వ్యక్తం చేశారు. ప్లెక్సీలు పెట్టుకుని ప్రచార్భాటాలు చేస్తూ రాజకీయాలు రాజకీయాలు చేస్తున్నారు తప్ప బాధితులకు సాయం అందించడంలేదని దుయ్యబట్టారు.ఒక ముఖ్యమంత్రిగా విశ్వసనీయత కావాలని కాని చంద్రబాబు అది లేదన్నారు. ఎన్నికల సమయంలో 612 వాగ్ధానాలు ఇచ్చి ప్రజలను మోసం చేశారన్నారు. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు. ఎంతమందికి నిరుద్యోగ భృతి ఇచ్చారో చంద్రబాబు సమా«ధానం చెప్పాలని ప్రశ్నించారు. .మహిళలు, రైతులు, నిరుద్యోగులతో పాటు అన్ని వర్గాలను చంద్రబాబు మోసం చేశాడని మండిపడ్డారు. ధర్మపోరాట దీక్షలంటూ దొంగ దీక్షలు చేస్తున్నారని దుయ్యబట్టారు.
 
Back to Top