వైయస్‌ఆర్‌సీపీ గెలుపు సునాయాసం


విజయనగరం: సి.రామచంద్రయ్య చేరికతో వచ్చే ఎన్నికల్లో వైయస్‌ఆర్‌సీపీ విజయం మరింత సునాయాసం అయ్యిందని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నాయకులు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. రామచంద్రయ్య చేరిక మంచి పరిణామమన్నారు. ఎన్నికలు దగ్గరకు వచ్చాయని, అటువైపు అప్రజాస్వామిక, అరాచకపాలనకు నాయకత్వం వహిస్తున్న చంద్రబాబు, ఇటువైపు విలువలు, విశ్వసనీయత, ప్రజాస్వామ్య పరిరక్షణ, నిబద్ధతతకు రాష్ట్రాభివృద్ధికి అంకితమైన వైయస్‌ జగన్‌ నిలిచారన్నారు.  ఎలాంటి సంశయాలకు తావు లేకుండా పరిణితి చెందిన సీనియర్‌ నాయకులు రామచంద్రయ్యకు రాష్ట్రస్థాయిలో గుర్తింపు ఉందన్నారు. స్వచ్చమైన రాజకీయ చరిత్ర కలిగిన ఇలాంటి నాయకులు వైయస్‌ఆర్‌సీపీలో చేరడం ఆహ్వానించదగ్గ పరిణామమన్నారు. ఆయన శక్తి, యుక్తులన్నీ కూడా పార్టీ విజయానికి మరింత దోహదం చేస్తాయని, సీనియర్‌ నాయకుడిగా ఆయనకు ఉన్న అనుభవం కూడా పార్టీ విజయానికి జోడిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇలాంటి నాయకులు ఇంకా ఎవరు వచ్చినా పార్టీ ఆహ్వానిస్తుందని చెప్పారు. చంద్రబాబు కలువడంతో కాంగ్రెస్‌ నిర్జివమైందన్నారు. కాంగ్రెస్‌కు భవిష్యత్తు లేదని, ఆ పార్టీ వారంతా వైయస్‌ఆర్‌సీపీలోకి రావాలని ఆయన ఆహ్వానించారు. చంద్రబాబును ఓడించేందుకు అన్ని శక్తులు వైయస్‌ఆర్‌సీపీకి అండగా ఉండాలని కోరారు. 

 
Back to Top