విజయవాడ: చంద్రబాబు ఐదు కోట్ల ఆంధ్రులకు మోసం చేశారని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి పార్థసారధి మండిపడ్డారు. కాంగ్రెస్‌తో చంద్రబాబు పొత్తు పెట్టుకోవడాన్ని ఏమనాలని ఆయన్ను ప్రశ్నించారు. కొత్తగా ఏర్పడిన ఏపీని అభివృద్ధి చేసిన తీరును చూసి, తాను అమలు చేసిన సంక్షేమ పథకాల తీరును చూసి నన్ను గెలపించండి అని అడిగే దమ్ము లేక అందరి కాళ్లు, వేళ్లు పట్టుకొని, దానికి పెద్ద రంగు పులిమి రాజ్యాంగం, థర్డ్ ఫ్రంట్ అంటూ కొత్త కొత్త భాష్యం చెబుతున్నారని మండిపడ్డారు. ఆయన ధ్యేయం రాష్ట్రాన్ని సర్వనాశనం అయినా అధికారమే పరమావధిగా చంద్రబాబు పెట్టుకున్నారన్నారు. హుటాహుటిన ఢిల్లీ వెళ్లి అన్ని రాజకీయ పక్షాల కాళ్లు పట్టుకున్నారో చూశామన్నారు. నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం రోజు రాష్ట్రాన్ని రెండుగా విడగొట్టిన పార్టీని కలుస్తున్నారంటే ఆయనకు విలువలు ఉన్నాయా అని ప్రశ్నించారు.